FAKE CHALLAN SCAM: ఏపీలో సరికొత్త నకిలీ వైరస్.. ఇది సోకితే.. రాష్ట్ర ఖజానా శంకరగిరి మాన్యాలేనట.. ఫోకస్ పెట్టిన సీఎం జగన్
ఏపీలో సరికొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఈవైరస్ అనేకరకాలుగా రూపాంతరం చెందుతూ...తనను తాను మార్చుకుంటూ పుట్టుకొచ్చింది. ఇది కానీ సోకితే.. ఇక ఖజానా శంకరగిరి మాన్యాలేనట. అదే నకిలీ వైరస్. మీరనుకున్నట్టు రోజూ కనిపించే...
ఏపీలో సరికొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఈవైరస్ అనేకరకాలుగా రూపాంతరం చెందుతూ.. తనను తాను మార్చుకుంటూ పుట్టుకొచ్చింది. ఇది కానీ సోకితే.. ఇక ఖజానా శంకరగిరి మాన్యాలేనట. అదే నకిలీ వైరస్. మీరనుకున్నట్టు రోజూ కనిపించే నకిలీ కాదిది. సరికొత్త వేరియంట్.. నకిలీని కనిపెట్టేకొద్దీ.. కొత్తదారులు వెతుక్కుంటోంది. సరికొత్తగా పుట్టుకువస్తోంది. గతంలో స్టాంప్ పేపర్ల స్కామ్ చూసి అయ్యబాబాయ్..అంటూ నోరెళ్లబెట్టేశామ్.. అయితే ఇప్పుడు అంతకుమించిన ఫోర్జరీ నడుస్తోంది రిజిస్ట్రేషన్ శాఖలో. అసలు రిజిస్ట్రేషన్ శాఖను ఎంత ప్రక్షాళన చేసినా.. మనకు అందకుండా.. నకిలీలల్లో ఎంతో ఎత్తుకు ఎదుగుతోందా అనిపిస్తోంది.
రిజిస్ట్రేషన్ల శాఖలో లేటెస్ట్ నకిలీ బాగోతం.. నకిలీ చలానాలు. డాక్యుమెంటరీ రైటర్ల బంగరు హస్తాలతో.. మనసున్న మారాజులైన కొందరు రిజిస్ట్రార్ల బహుమంచితనంతో ఈ దందా మూడు నకిలీ చలానాలు.. ఆరు రిజిస్ట్రేషన్లు అన్నట్టుగా నడుస్తోంది…కొన్ని కోట్లరూపాయలు అన్నట్టుగా సాగుతోంది.
ఇన్నాళ్లు తెలిసింది అకౌంట్ టూ…ఇది అకౌంట్ అండర్ వాల్యూకే మొగుడన్నమాట. ప్రతిరోజూ…ఈ దందాలో ఒక్కొక్కడు లక్షలు లేనిదే ఇంటికెళ్లడట. ఇదెట్టా ఇదెట్టా అని ఆలోచించి చించి చింసుకోగా.. అప్పుడు తెలిసిందట బుర్రలు బద్దలయ్యే నిజం అధికారులకు. చలానాల్లో కనిపించేదంతా.. అబద్దమేమో. కాస్త లోతుకెళ్లి చూస్తే తెలుస్తుంది అసలు నిజం.. ఏందిరా ఇది అనుకునేలోపు.. నకిలీ గాళ్లు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు శఠగోపం పెట్టారు. ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖలో వేళ్లూనుకుపోయిన నకిలీ బాగోతం ఇది.
మొత్తం17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు జిల్లా, నంద్యాల సబ్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్లను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. 2021 ఏప్రిల్ నుంచి జులై వరకు 54 నకిలీ చలానాలు గుర్తించారు. నకిలీ చలానాలతో లక్షల రూపాయల మేర గోల్‌మాల్ జరిగినట్టు నిర్ధారించారు. చలానాల గోల్‌మాల్‌లో డాక్యుమెంట్ రైటర్ల పాత్రే కీలకమట.
15రోజుల్లో టోటల్ కేసు కొలిక్కి తెస్తామంటున్నారు విజయవాడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ. ఇప్పటి వరకు కోటి రూపాయలు రికవరీ చేసినట్లు తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకునేవారికి సంబంధించి ఇబ్బందులుంటాయా ఉండవా అన్నది కేసును బట్టి ఉంటుందన్నారు అధికారులు
ప్రస్తుతం సీఎం జగన్ నకిలీ చలానాలపై సీరియస్ అయ్యారు. టోటల్ రికవరీపై దృష్టిపెట్టి..నిందితులను శిక్షించాలని ఆదేశించారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నారు. సీఎఫ్‌ఎంఎస్లోని లొసుగులు కారణంగా నకిలీ దందా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇక నుంచి డాక్యుమెంటరీ రైటర్స్‌కు అర్హత పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే పద్దతి కాకుండా.. అసలు కాలకుండా చూసుకుంటే బెటర్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: Krishna District: ‘జామకాయ’ ఆ పసిపాప జీవితాన్ని అర్ధాంతరంగా చిదిమేసింది
viral video: శివంగిలా మారిన మహిళ.. యువకుడిని కిందపడేసి మరీ చితకబాదేసింది.. ఎందుకో తెలుసా..