Andhra Pradesh: ఏళ్లుగా సహజీవనం చేశాడు.. ఆమె కూతురుపైనా కన్నేశాడు.. కాదన్నందుకు కడతేర్చాడు..

Andhra Pradesh: గుంటూరు జిల్లాలో మంగళగిరి పరిధిలోని కొప్పురావు కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఏళ్లుగా సహజీవనం చేసిన మహిళపై కక్ష పెంచుకుని కడతేర్చాడు..

Andhra Pradesh: ఏళ్లుగా సహజీవనం చేశాడు.. ఆమె కూతురుపైనా కన్నేశాడు.. కాదన్నందుకు కడతేర్చాడు..
Killed
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 14, 2021 | 5:31 AM

Andhra Pradesh: గుంటూరు జిల్లాలో మంగళగిరి పరిధిలోని కొప్పురావు కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఏళ్లుగా సహజీవనం చేసిన మహిళపై కక్ష పెంచుకుని కడతేర్చాడు ఓ మానవ మృగాడు. అత్యంత దారుణంగా గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరిలోని కొప్పురావు కాలనీలో మహిళ తన కూతురుతో కలిసి నివాసం ఉంటోంది. ఆమెకు భర్త లేడు. ఈ క్రమంలోనే.. అదే ప్రాంతానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఏళ్ల తరబడి ఇద్దరూ సహజీవనం చేశారు. అయితే, సాంబశివరావు.. సదరు మహిళ కూతురుపై కన్నేశాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పలుమార్లు హెచ్చరించింది. అయినా సాంబశివరావు బుద్ధి మాత్రం మారలేదు.

దాంతో సదరు మహిళ సాంబశివరావుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను, తన కూతురుని లైంగికంగా వేధిస్తున్నాడంటూ కంప్లయింట్ ఇచ్చింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాంబశివరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అతనికి జైలు శిక్ష కూడా పడింది. ఇటీవలె జైలు నుంచి విడుదలనైన సాంబశివరావు.. సదరు మహిళపై కక్షతో రగిలిపోయాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా అతను సదరు మహిళ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కారణంగానే మహిళను సాంబశివరావు చంపేశాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు సాంబశివరావు కోసం గాలిస్తున్నారు.

Also read:

Earthquake: పాకిస్తాన్‌లో అర్థరాత్రి భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు.. తీవ్రత ఎంతంటే..

IND vs ENG 2nd Test: రెండో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోర్ 45 ఓవర్లకు 119/3..

Hyderabad: వేరే వ్యక్తి మరదలి ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టుకున్న యువకుడు.. ఇదేంటని నిలదీసినందుకు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!