AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వేరే వ్యక్తి మరదలి ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టుకున్న యువకుడు.. ఇదేంటని నిలదీసినందుకు..

Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మా అత్త కూతురు ఫోటోని వాట్సప్ డీపీగా ఎందుకు పెట్టుకున్నావ్ అని ప్రశ్నించినందుకు..

Hyderabad: వేరే వ్యక్తి మరదలి ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టుకున్న యువకుడు.. ఇదేంటని నిలదీసినందుకు..
Crime
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 14, 2021 | 6:35 AM

Share

Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మా అత్త కూతురు ఫోటోని వాట్సప్ డీపీగా ఎందుకు పెట్టుకున్నావ్ అని ప్రశ్నించినందుకు.. కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన హసన్ నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు సకాలంలో స్పందించడంతో.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు యువకుడు. ఈ ఘటన తాలూకు వివరాలు వివరాలు ఇలా ఉన్నాయి. అక్రమ్, మోసిన్ అనే యువకులు హసన్ నగర్ పరిధిలో నివసిస్తున్నారు. అయితే, మోసిన్ అత్త కూతూరు ఫోటోను అక్రమ్ వాట్సప్ డీపీగా పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోసిన్.. అక్రమ్‌కు ఫోన్ చేశాడు. ఫోటో వ్యవహారంపై ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.

ఈ క్రమంలోనే మళ్లీ ఇవాళ ఘర్షణ చోటు చేసుకుంది. ఉదయం అక్రమ్‌కు మోసిన్ ఫోన్ చేసి పిలిచాడు. ఇద్దరు వచ్చాక.. వాట్సప్ డీపీ ఎందుకు పెట్టుకున్నావని ప్రశ్నించాడు. దానికి స్పందించిన అక్రమ్.. నా ఇష్టం అంటూ బదులిచ్చాడు. దీంతో కోపోద్రిక్తుడైన మోసిన్.. నా అత్త కూతురు ఫోటోను నువ్వు ఎలా డీపీగా పెట్టుకుంటావ్ అని గట్టిగా నిలదీశాడు. మళ్లీ నా ఇష్టం అంటూ సమాధానం ఇచ్చాడు అక్రమ్. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం భౌతిక దాడులకు పాల్పడ్డారు. అయితే, అప్పటికే పరిస్థితిని ఊహించిన అక్రమ్.. పక్కా స్కెచ్ ప్రకారం కత్తులు వెంట తీసుకువచ్చాడు అక్రమ్. మోసిన్‌ను అంతమొందించాలని ప్లాన్ వేసుకున్నాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో కత్తి తీసి అక్రంతో పాటు అతని స్నేహితుడు నాను కలిసి మోసిన్‌పై దాడి చేశారు.

దీంతో భయపడిపోయిన మోసిన్ తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. వారు అతన్ని వదలలేదు. కత్తితో తలపై, కడుపులో పొడిచారు. తలపై కత్తితో మూడు సార్లు దాడి చేశారు. ఈ దాడిని గమనించిన స్థానికులు.. వెంటనే రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మోసిన్‌ను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మోసిన్‌కు వైద్యులు చికిత్స అందించారు. ప్రాణహానీ లేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ్, నాను లపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

IND vs ENG 2nd Test: ఐదేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడాడు.. మొదటి బంతికే గోల్డెన్ డక్.. 75 సంవత్సరాల చెత్త రికార్డుకు బ్రేక్

Adilabad BJP Leaders: దాబా పే చర్చా.. అయ్యో హస్తం వీడి తప్పు చేశామా..?

AP Schools: విశాఖపట్నం పరిపాలనా రాజధాని అంశం మీద మంత్రి అవంతి హాట్ కామెంట్స్