AP Schools: విశాఖపట్నం పరిపాలనా రాజధాని అంశం మీద మంత్రి అవంతి హాట్ కామెంట్స్

నేడు-నేడు పథకం కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఒక్క విశాఖ జిల్లాలోనే నేడు నేడు కింద

AP Schools: విశాఖపట్నం పరిపాలనా రాజధాని అంశం మీద మంత్రి అవంతి హాట్ కామెంట్స్
Minister Avanti
Follow us

|

Updated on: Aug 13, 2021 | 10:05 PM

AP Minister Avanti Srinivas: నేడు-నేడు పథకం కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఒక్క విశాఖ జిల్లాలోనే నేడు నేడు కింద రూ.309 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రభుత్వపాఠశాలను.. ప్రైవేట్ స్కూల్స్‌కి దీటుగా తీర్చిదిద్దుతామని చెప్పిన మంత్రి.. ఈ నెల 16న జగన్న విద్యా దీవెన కార్యక్రమం ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

“విద్యతో పాటు వైద్యానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. అధిక నిధులు కేటాయిస్తున్నాము. అనకాపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటును కొందరు కోర్ట్ కి వెళ్లి అడ్డుకుంటున్నారు. కేజీహెచ్, విమ్స్ ఆసుపత్రులను విస్తరణ చేస్తాం. ప్రతిపక్షాలు అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నాయి. భవిష్యత్‌లో విశాఖ ములిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు. పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పటి నుండి విశాఖ పై విషం చిమ్ముతునే ఉన్నారు. అమరావతి రాజధాని అయితే విశాఖ అందమైన నగరం…. విశాఖ పరిపాలన రాజధాని అయితే మాత్రం ములిగిపోతుంది, తుఫాన్లు ముప్పు,కాలుష్యం అన్ని ఉంటాయి.” అని అవంతి టీడీపీ నేతల కామెంట్లను ఎద్దేవా చేశారు.

Read also: Fever: వణికిస్తోన్న విష జ్వరాలు.. సీజనల్ వ్యాధులకు తోడు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ముప్పేటదాడి, జనం విలవిల