Reddy Corporation: ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి ఇవాళ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తాడేపల్లిలోని సీయస్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో
Andhra Pradesh Reddy Corporation Chairman: ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి ఇవాళ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తాడేపల్లిలోని సీయస్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని కొత్త చైర్మన్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర రావు
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం సీఎం జగన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్లను ప్రకటిస్తున్నారు. నిన్న విజయవాడలో ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ దానేకుల కళ్యాణ మండపంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు హాజరై కార్పొరేషన్ ఛైర్మన్‌కు అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరి అభివృద్ధి కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు తుమ్మల చంద్రశేఖర రావు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
కమ్మ సామాజిక వర్గంలో పేద మధ్యతరగతి వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ ప్రభుత్వం నుండి రావలసిన సంక్షేమ పథకాలు అందేలా తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఎం ఇచ్చిన అవకాశానికి వందశాతం న్యాయం చేస్తానని చంద్రశేఖర్ చెప్పారు.
Read also: Big News Big Debate: దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం