Challans Scam: చలనాల మార్ఫింగ్ స్కామ్‌తో డాక్యుమెంట్‌ రైటర్లపై దృష్టి.. 25 ఏళ్ల క్రితం లైసెన్సింగ్‌ విధానాన్ని తిరిగి తెచ్చే ప్రతిపాదన

నకిలీ చలనాల స్కామ్‌తో డాక్యుమెంట్‌ రైటర్లపై జగన్ సర్కారు దృష్టి పెట్టింది. డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సింగ్‌ విధానాన్ని తెచ్చే అంశంపై స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు మొదలుపెట్టింది.

Challans Scam: చలనాల మార్ఫింగ్ స్కామ్‌తో డాక్యుమెంట్‌ రైటర్లపై దృష్టి.. 25 ఏళ్ల క్రితం లైసెన్సింగ్‌ విధానాన్ని తిరిగి తెచ్చే ప్రతిపాదన
Document Writers
Follow us

|

Updated on: Aug 13, 2021 | 9:50 PM

Andhra Pradesh Fake Challan Scam: నకిలీ చలనాల స్కామ్‌తో డాక్యుమెంట్‌ రైటర్లపై జగన్ సర్కారు దృష్టి పెట్టింది. డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సింగ్‌ విధానాన్ని తెచ్చే అంశంపై స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. నకిలీ చలానా స్కామ్‌లో డాక్యుమెంట్‌ రైటర్లదే కీలక పాత్ర కావడంతో లైసెన్సింగ్‌ విధానంపై దృష్టి సారించారు అధికారులు. 25 ఏళ్ల క్రితం డాక్యుమెంట్‌ రైటర్ల లైసెన్సింగ్‌ విధానాన్ని తిరిగి అమలు చేద్దామంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే వారికే డాక్యుమెంట్‌ రైటర్ల లైసెన్స్‌ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వానికి చెల్లించే ఫీజు విషయంలో జరిగిన బోగస్ చలనాల కుంభకోణంపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇవాళ అమరావతిలోని క్యాంప్ ఆఫీస్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై ఫోకస్ పెట్టాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు.

ఇప్పటికే రూ. 40 లక్షల మేర సొమ్మును రికవరీ చేసినట్టు అధికారులు సీఎం‌కు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ లో మార్పులు చేసినట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్‌లకు అనుసంధానం చేసినట్టు చెప్పారు. అనుసంధానం ద్వారా అవకతవకలకు చెక్ పెట్టవచ్చని సీఎంకు అధికారులు వివరించారు. ఇక, బోగస్ ఛలాన్లకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఎం జగన్ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.

కాగా, నకిలీ చలానాల దందా గుంటూరు జిల్లాలోనూ బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌లు చేయించుకొని.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లుగా తెలుసుకున్న అధికారులు తనిఖీలు చేపట్టారు. మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్ పరిధిలో 8 డాక్యుమెంట్స్‌లో నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. సీఎఫ్‌ఎంఎస్‌లోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొని.. ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తేల్చారు అధికారులు.

Read also: Lokesh: ‘అది ఇంటి గొడ్డలేన‌ని.. సొంతింటి వేట‌ కొడ‌వ‌లే వివేకాని వేటాడింద‌ని స్పష్టం అవుతోంది’: నారా లోకేష్

3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..