Woman Suicide: బెంగుళూరులో ఉన్న భర్తను రాత్రికి రాత్రే ఇంటికి పిలిచింది.. భర్త కళ్లెదుటే నిప్పుంటుకుని ఆత్మహత్య.. కారణం ఏమంటే..?
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. అత్తవారి ఇంటిముందే ఓ వివాహిత ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది.
Chittoor Women sets Self Ablaze: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. అత్తవారి ఇంటిముందే ఓ వివాహిత ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. బైరెడ్డిపల్లి మండలం మునిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో తనకు తాను సజీవ దహనం చేసుకుని ప్రాణాలు విడిచింది. గత కొన్ని రోజులుగా.. కుటుంబంలో కలహాల కారణంగా.. తీవ్ర మనస్తాపం చెందిన సదరు మహిళ, భర్త ఎదుటే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మునిపల్లి గ్రామానికి చెందిన హరిప్రసాద్‌రెడ్డికి రెండేళ్ల క్రితం పుదుచ్చేరికి చెందిన సత్యవాణితో ప్రేమ వివాహం జరిగింది. బెంగళూరులో ఇద్దరు కాపురం పెట్టారు. కొంత కాలం బాగానే ఉన్న దంపతుల మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చాయి. ఇదే క్రమంలో నిన్నటి అర్ధరాత్రి భర్త స్వగ్రామం మునిపల్లికి వచ్చిన భార్య సత్యవాణి భర్త ఇంట్లో లేకపోవటంతో అత్త మామలతో గొడవకు దిగింది. తన భర్తను ఇంటికి పిలిపించాలని సత్యవాణి కోరింది. దీంతో తెల్లవారుజామున ఇంటికి చేరుకున్న భర్త హరి ప్రసాద్, అత్త మామల ముందే భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఇంటి బయటకు వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని భార్య సత్యవాణి నిప్పంటించుకుంది.
ఈ హఠాత్తు పరిణామంతో ఒక్కసారిగా షాకింగ్‌కు గురైన భర్త.. భార్య మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భర్త చేతులకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, అత్తింటి వారి వేధింపుల కారణంగానే మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Also… TS Corona Cases: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 427 మందికి పాజిటివ్, ఇద్దరు మృతి
PV Sindhu – Disha: దిశ యాప్ వాడండి: సింధు, ఆమె తల్లిదండ్రులను సత్కరించిన డీజీపీ, ఉన్నతాధికారులు