AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Crime News: సీట్​లో బ్యాగ్​ను ఉంచి టికెట్​ తీసుకోవడానికి వెళ్లాడు.. అంతే ఫసక్.. భారీ చోరీ

నిజామాబాద్​ జిల్లా బోధన్ బస్టాండ్​లో.. నిన్న రాత్రి సినీఫక్కీలో ఘరానా దొంగతనం జరిగింది. పక్కా ప్లాన్‌తో కాపుకాసి మరీ నగలవ్యాపారి...

Telangana Crime News: సీట్​లో బ్యాగ్​ను ఉంచి టికెట్​ తీసుకోవడానికి వెళ్లాడు.. అంతే ఫసక్.. భారీ చోరీ
Electric Buses
Ram Naramaneni
|

Updated on: Aug 13, 2021 | 8:22 PM

Share

నిజామాబాద్​ జిల్లా బోధన్ బస్టాండ్​లో.. గురువారం రాత్రి సినీఫక్కీలో ఘరానా దొంగతనం జరిగింది. పక్కా ప్లాన్‌తో కాపుకాసి మరీ నగలవ్యాపారి నుంచి ఆగంతకులు బ్యాగ్​ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్​కు చెందిన నగల వ్యాపారి దళపత్​ సింగ్​ నుంచి 41 తులాల బంగారం, 7 కిలోల వెండి, లక్ష నగదును దోచుకెళ్లారు. బోధన్​లోని షాపలకు బంగారం, వెండి ఇచ్చి తిరిగి హైదరాబాద్​ వెళ్లడానికి బస్​ ఎక్కారు. తన సీట్​లో బ్యాగ్​ను ఉంచి టికెట్​ తీసుకోవడానికి డ్రైవర్​ వద్దకు వెళ్లగానే.. అక్కడే కాపుకాసిన దుండగులు బ్యాగ్​ను ఎత్తుకెళ్లారు. గ్రహించిన బాధితుడు.. బోధన్​ సీటీ పోలీసులను ఆశ్రయించారు.   వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేశారు.  దొంగలముఠాను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించారు.

 తల్లిని కొట్టాడని.. మేనమామపై కత్తితో దాడి

తల్లిని కొట్టాడనే కారణంతో మేనమామపై అల్లుళ్లు విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పరపల్లిలో వారం క్రితం ప్రభాకర్​ అనే వ్యక్తి.. మద్యం మత్తులో తన అక్క భారతమ్మను కొట్టాడు. ఇదే విషయాన్ని హైదరాబాద్​లో ఉంటున్న ఆమె తన తనయులు రమేశ్​, సంపత్​లకు చెప్పింది. ఆగ్రహించిన వారు.. హైదరాబాద్​ నుంచి వచ్చి.. మేనమామ ప్రభాకర్​ను పంచాయితీకి పిలిపించారు. గ్రామపెద్దల సమక్షంలో విచారణ జరుగుతోంది. ఆ సమయంలో ఇరు వర్గాలు మాటలు జారాయి. అది కాస్త మేనమామ, అల్లుళ్ల మధ్య గొడవకు దారితీసింది. ఈ క్రమంలో మామపై కత్తితో విచక్షణరహితంగా దాడిచేశారు. ఈ ఘటనలో ప్రభాకర్​కు తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు చికిత్స కోసం వరంగల్​ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు.

Also Read:‘జామకాయ’ ఆ పసిపాప జీవితాన్ని అర్ధాంతరంగా చిదిమేసింది

 నాగుల పంచమి వేళ పాముకు హ్యపీ బర్త్ డే.. నెట్టింట రచ్చ చేస్తోన్న వీడియో