Nag Panchami 2021: నాగుల పంచమి వేళ పాముకు హ్యపీ బర్త్ డే.. నెట్టింట రచ్చ చేస్తోన్న వీడియో

నాగుల‌పంచమి వేళ కొందరు యువకులు పాముకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినట్లుగా ఉన్న ఒక వీడియో నెట్టింట తెగ..

Nag Panchami 2021: నాగుల పంచమి వేళ పాముకు హ్యపీ బర్త్ డే.. నెట్టింట రచ్చ చేస్తోన్న వీడియో
Happy Birthday Snake
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 13, 2021 | 5:44 PM

నాగుల‌పంచమి వేళ కొందరు యువకులు పాముకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినట్లుగా ఉన్న ఒక వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. పడగవిప్పిన నాగు పాము చుట్టూ చేరి ‘హ్యాపీ బర్త్ డే టూ యూ.. హ్యాపి బర్త్ డే నాగోబా’ అంటూ హంగామా చేశారు యువకులు. ఈ ఘటన రెండేళ్ల క్రితమే జరిగినా నాగుల పంచమి సందర్భంగా నేడు మరోసారి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఈ ఘటన జరిగిందని చెపుతున్నా అది వాస్త‌వం కాదని తేలింది. 2019 లో యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన ఈ వీడియోను కొందరు యువకులు నేడు వాట్సాప్, ఫేస్ బుక్ స్టేటస్‌‌గా పెట్టుకోవడం కనిపించింది.

 భక్తితో నాగమ్మకు పూజలు

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. ఈరోజు నాగపంచమి సందర్భంగా భక్తితో సర్పాలను పూజిస్తున్నారు. పుట్టవద్దకు వెళ్లి పాలు పోసి.. పూలు పెట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నాగపంచమి రోజున సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లైతే సంతానభాగ్యం కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.

ఆ పాములకు పాలు పోయొద్దు..: తెలంగాణ అటవీ శాఖ

నాగపంచమి రోజున సర్పాలను రక్షించండి అంటూ తెలంగాణ అటవీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పాములు పట్టి బుట్టల్లో పెట్టుకుని తిరిగేవారికి ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని కోరింది. 10 రోజుల పాటు వాటికి ఆహారం, నీరు ఇవ్వకుండా ఆ సర్పాలను హింసించి నాగుల పంచమి రోజు గుడికి తీసుకొస్తారని.. అందుకే అవి పాలు తాగుతాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ఇలా సర్పాలను హింసించేవారిని ప్రోత్సహించవద్దని సూచించారు. శుక్రవారం(ఆగస్టు 13) నాగుల పంచమి సందర్భంగా అటవీశాఖ అధికారులు ఈ సూచన జారీ చేశారు. నాగుల పంచమి రోజు పాములను హింసించేవారని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పాములను హింసించేవారు కనిపిస్తే 8002455364 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

Also Read: జంతువుల వెంట్రుకల్ని దొంగిలించే పక్షులు.. పెద్ద రీజనే ఉందడోయ్

ఈ వీడియో చూస్తే నవ్వలేక మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం.. ??