Interesting News: జంతువుల వెంట్రుకల్ని దొంగిలించే పక్షులు.. పెద్ద రీజనే ఉందడోయ్

ఏ జీవికైనా నివాసం చాలా ముఖ్యం. పొద్దంతా ఎటు తిరిగి వచ్చానా.. మాపుటేల విశ్రాంతి తీసుకోవడానికి నివాసం కావాలి. అందుకు జంతువులు, పక్షులు...

Interesting News: జంతువుల వెంట్రుకల్ని దొంగిలించే పక్షులు.. పెద్ద రీజనే ఉందడోయ్
Stealing Animal Hair
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 13, 2021 | 4:52 PM

ఏ జీవికైనా నివాసం చాలా ముఖ్యం. పొద్దంతా ఎటు తిరిగి వచ్చానా.. మాపుటేల విశ్రాంతి తీసుకోవడానికి నివాసం కావాలి. అందుకు జంతువులు, పక్షులు కూడా అతీతం కాదు. చాలా రకాల పక్షులు గూడు కట్టడం కోసం పెద్ద యుద్దమే చేస్తుంటాయి. అందుకోసం అవి.. గడ్డి పోచలు, వివిధ రకాల ఆకులు, పీచులతో పాటు చిన్న కట్టెపుల్లలను తీసుకువచ్చి అందంగా ఇల్లును నిర్మించుకుంటాయి. అయితే  కొన్ని రకాల పక్షులు గూడు కోసం జంతువుల నుంచి వాటి జుట్టును పెరికేస్తాయి. ఈ క్రమంలో జంతువుల ఆగ్రహం కారణంగా వాటి చేతిలో గాయపడడమో లేదంటే చనిపోవడమో జరుగుతుంది.  ఈ చర్యకు సైంటిఫిక్‌గా ఇన్నాళ్లూ ఓ పేరంటూ లేదు. తాజాగా పక్షులు చేసే ఈ డేంజరస్ యాక్ట్‌కు ఓ పదం, మీనింగ్ ఇచ్చారు శాస్త్రవేత్తలు.

అసాధారణమైన ఈ ప్రవర్తనకు ‘క్లెప్టోట్రిచి’ అని నేమ్ పెట్టారు. ఇది ఒక గ్రీకు పదం.. దొంగిలించడం లేదా జుట్టు అనే రెండు మీనింగ్స్ వస్తాయి. అందుకే పక్షుల చర్యకు సరిపోతుందనే రీజన్‌తో ఆ పేరు పెట్టారు. జులై 27న జీవావరణ శాస్త్రంలో ఈ పదం చేర్చినట్లు ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ సైంటిస్టులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే పక్షులు గడ్డిని, ఆకులు వదిలేసి.. జంతువులు జుట్టు కోసం వెళ్లడానికి కూడా  ఓ రీజన్ ఉంది. చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీటైన గూళ్ల నిర్మాణం కోసం అవి ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి. ఇక ఏ జంతువులు, పాములు తమ గూళ్లపై అటాక్ చేయడంగా.. ఓ భయంకరమైన ప్రాణిగా కనిపించేలా తమ నివాసాలను తీర్చిదిద్దుతాయి.  పిల్లులు, నక్కలు, కుక్కలు, రకూన్‌ల నుంచి పక్షులు జుట్టును సేకరిస్తాయి. పడుకున్నప్పుడో లేదంటే తింటున్నప్పుడో.. అదనుచూసి వెంట్రుకల్ని లాగేస్తాయి . కానీ, ప్రమాదాలను అంచనా వేయకుండా ఒక్కోసారి విఫలమై.. అవి ప్రాణాలను పొగొట్టుకుంటాయని యానిమల్‌ బిహేవియరిస్ట్‌లు చెబుతున్నారు.

Also Read:ఈ వీడియో చూస్తే నవ్వలేక మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం.. ??

భారీ లెహంగాతో, ఒంటి నిండా నగలతో వధువు పుషప్స్.. పిచ్చెక్కిపోతున్న నెటిజన్స్