AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వలేక మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం.. ??

ఇప్పుడు ప్రాంక్ వీడియోల ట్రెండ్ నడుస్తోంది. అందులో కొన్ని జనాన్ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. కొన్ని మాత్రం కాస్త హద్దు మీరినట్టు...

Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వలేక మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం.. ??
Funny Video
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Aug 14, 2021 | 8:02 PM

ఇప్పుడు ప్రాంక్ వీడియోల ట్రెండ్ నడుస్తోంది. అందులో కొన్ని జనాన్ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. కొన్ని మాత్రం కాస్త హద్దు మీరినట్టు అనిపిస్తున్నాయి. ఇంకొన్ని అయితే పక్కా స్క్రిప్ట్ ప్రకారం చేస్తున్నారని వాటిని చూస్తేనే అర్థమవుతుంది. తాజాగా ఓ ప్రాంక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్త్ ట్రెండ్  అవుతుంది. దీని థీమ్ ఏంటంటే.. ప్రాంక్ షూట్ చేసే క్రమంలో  బట్టతల ఉన్న వ్యక్తి విగ్ బిట్ పెట్టుకుని.. మాల్‌లోని ఎక్స్‌లేటర్‌పై వెళ్తూ.. ఎదురుగా జనం తనవైపు చూస్తున్నప్పుడు విగ్ బిట్ ఊడిపోయేలా తల ఎగరెయ్యాలి. అప్పుడు ఎదుటివారి ఫన్నీ లేదా షాకింగ్ రియాక్షన్స్ రికార్డ్ చెయ్యాలి. ఇదే క్రమంలో తాము అనుకున్నట్లుగా కొందరి రియాక్షన్స్ గ్రాబ్ చేశారు. అయితే ఓ వ్యక్తి మాత్రం.. ప్రాంక్ చేస్తున్న వ్యక్తికి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.  మీది తెనాలి.. మాది తెనాలి.. మనది తెనాలి అన్నది…చిరంజీవి సినిమాలో బ్రహ్మనందం డైలాగ్. బాగా ఫేమస్‌ కూడానూ. అయితే, అచ్చం ఈ డైలాగుకు తీసిపోనట్టుగానే ఇతగాడి రిప్లై ఉంది. నీదే కాదు.. నాది కూడా విగ్ బిట్ అని ఎక్స్‌లేటర్‌పై ఎదురుగా వస్తున్న వ్యక్తి కూడా తల ఎగరేసి.. బిట్ ఊడిపోయేలా చేశాడు. దీంతో ప్రాంక్ చేసిన వ్యక్తి నవ్వుల్లో మునిగిపోయాడు.

ఫన్నీ వీడియో వీక్షించండి…

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. నెటిజన్లు ఈ వీడియోను లైక్, షేర్ చెయ్యడమే కాకుండా తమ మార్క్ కామెంట్స్ పెడుతున్నారు. ‘ఇదేంట్రా బాబు..ఇద్దరు ఇద్దరే’ అని ఒక యూజర్ కామెంట్ పెట్టగా.. ‘రిటర్న్ పంచ్ అదుర్స్’  అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.

Also Read: భారీ లెహంగాతో, ఒంటి నిండా నగలతో వధువు పుషప్స్.. పిచ్చెక్కిపోతున్న నెటిజన్స్

బాయ్‌ఫ్రెండ్ కోసం యువతుల ఫైట్… నడి రోడ్డు కాస్తా బాక్సింగ్ రింగ్ అయిపోయింది

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ