AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay-Dhoni: విజయ్‌ని కలిసిన క్రికెటర్ ధోనీ.. వివాదంగా మారిన పోస్టర్లు.. ఇంతకీ అందులో ఏముందంటే..

MS Dhoni Meets Vijay: సినీ నటుడు విజయ్ అభిమానులు చేసిన ఓ పని.. తమిళనాట రచ్చ రచ్చగా మారింది. వారి అత్యుత్సాహం.. ఏకంగా విజయ్, క్రికెటర్ ధోనీకి తలనొప్పి తెచ్చిపెట్టేదిలా ఉంది.

Vijay-Dhoni: విజయ్‌ని కలిసిన క్రికెటర్ ధోనీ.. వివాదంగా మారిన పోస్టర్లు.. ఇంతకీ అందులో ఏముందంటే..
Dhoni And Vijay
Shiva Prajapati
|

Updated on: Aug 14, 2021 | 5:38 AM

Share

MS Dhoni Meets Vijay: సినీ నటుడు విజయ్ అభిమానులు చేసిన ఓ పని.. తమిళనాట రచ్చ రచ్చగా మారింది. వారి అత్యుత్సాహం.. ఏకంగా విజయ్, క్రికెటర్ ధోనీకి తలనొప్పి తెచ్చిపెట్టేదిలా ఉంది. తమ అభిమాన నటుడు, క్రికెటర్ కలుసుకోవడంతో ఉబ్బితబ్బిబ్బైపోయిన అభిమానులు.. అత్యుత్సాహం ప్రదర్శించి ఊహించని రీతిలో పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లు ఇప్పుడు వివాదానికి ఆజ్యం పోశాయి. చెన్నైలో యాడ్ షూటింగ్‌లో భాగంగా నటుడు విజయ్‌ని క్రికెటర్ ధోనీ కలిశాడు. వారి మధ్య సుమారు గంట పాటు సంభాషణ జరిగింది.

Poster

ధోనీ, విజయ్‌ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ఈ ఇద్దరి కలయికపై అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంఎస్ ధోనీ ఈ దేశానికి ప్రధాన మంత్రి గానూ.. రాష్ట్రానికి సీఎంగా విజయ్ ఉండాలని పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్లను తమిళనాడులోని మధురైలో అంటించారు. ఈ పోస్టర్లపై ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీకి రాజకీయాలు అంటకట్టొద్దని, ఈ పద్ధతి సరికాదని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.

కాగా, రెండ్రోజుల క్రితం టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోని తమిళ స్టార్ హీరో విజయ్‌కు షాక్ ఇచ్చాడు. విజయ్ సెట్లోకి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్‌ బీస్ట్‌ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా చెన్నైలోని గోకులం స్టూడియోలో జరుగుతోంది. అయితే, ఓ యాడ్‌ షూటింగ్‌లో భాగంగా మిస్టర్ కూల్ గోకులం స్టూడియో‌కి చేరుకున్నాడు. దీంతో విజయ్ కొత్త సినిమా షూటింగ్ విషయం తెలుసుకుని సెట్‌కి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి చాలాసేపు ముచ్చటించారు. వీరి మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

Also read:

Andhra Pradesh: ఏళ్లుగా సహజీవనం చేశాడు.. ఆమె కూతురుపైనా కన్నేశాడు.. కాదన్నందుకు కడతేర్చాడు..

Earthquake: పాకిస్తాన్‌లో అర్థరాత్రి భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు.. తీవ్రత ఎంతంటే..

IND vs ENG 2nd Test: రెండో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోర్ 45 ఓవర్లకు 119/3..