AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: పాకిస్తాన్‌లో అర్థరాత్రి భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు.. తీవ్రత ఎంతంటే..

Earthquake: పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం.. అర్థరాత్రి సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.9 గా నమోదైంది.

Earthquake: పాకిస్తాన్‌లో అర్థరాత్రి భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు.. తీవ్రత ఎంతంటే..
Earthquake
Shiva Prajapati
|

Updated on: Aug 14, 2021 | 5:10 AM

Share

Earthquake: పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం.. అర్థరాత్రి సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.9 గా నమోదైంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం నివేదించబడలేదు. అయితే, గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో.. ప్రజలు హడలిపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు తీశారు. కాగా, జూన్‌ మాసంలోనూ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భూకంపం సంభవించింది. అప్పుడు దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5 గా ఉంది. అదే సమయంలో, భూకంప కేంద్రం రాజధాని నుండి 146 కి.మీ దూరంలో నైరుతి దిశలో కేంద్రీకృతమైంది ఉంది. ఈ భూ ప్రకంపనలు రాజధానితో పాటు దాని పరిసర ప్రాంతాలలో కూడా కనిపించాయి.

ఈ సంవత్సరం ప్రారంభంలో, ఇస్లామాబాద్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అనేక నగరాలతో సహా దేశంలోని ఉత్తర ప్రాంతాలలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు భారతదేశంలోని అనేక నగరాల్లో కూడా కనిపించాయి.

భూకంపం ఎందుకు వస్తుంది..? భూమి అనేక పొరలుగా విభజించబడింది. భూమి కింద అనేక రకాల ప్లేట్లు ఉన్నాయి. ఈ ప్లేట్లు కలిసి ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఈ ప్లేట్ల మధ్య సర్దుబాట్లు జరుగుతుంటాయి. దీని కారణంగా భూకంపం సంభవిస్తుంది. కొన్నిసార్లు ఇది మరింత ఎక్కువ ప్రకంపనలు వస్తాయి. ఫలితంగా దాని తీవ్రత దారుణంగా ఉంటుంది.

భారతదేశానికి సంబంధించినంత వరకు.. భూమి లోపలి పొరలలో భౌగోళిక కదలిక ఆధారంగా కొన్ని మండలాలు నిర్ణయించబడ్డాయి. కొన్ని చోట్ల ఇది ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. భూకంపం సంభవించే పరిస్థితుల ఆధారంగా.. భారతదేశాన్ని 5 జోన్లుగా విభజించారు.

Also read:

IND vs ENG 2nd Test: రెండో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోర్ 45 ఓవర్లకు 119/3..

Hyderabad: వేరే వ్యక్తి మరదలి ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టుకున్న యువకుడు.. ఇదేంటని నిలదీసినందుకు..

IND vs ENG 2nd Test: ఐదేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడాడు.. మొదటి బంతికే గోల్డెన్ డక్.. 75 సంవత్సరాల చెత్త రికార్డుకు బ్రేక్