AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASA: అది తగిలితే.. అంతా తుడిచిపెట్టుకుపోతుంది.. భూమిని ఢీ కొట్టనున్న భారీ గ్రహశకలం..

దూసుకొస్తున్న మహాముప్పు... యుగాంతం తప్పదు.. అంటూ ఇప్పటికే ఎన్నో వైరల్‌ న్యూస్‌లు చదవి ఉంటారు. అలానే.. భూమి అంతం అయిపోతుందని.. డేట్‌ ఫిక్స్‌ చేసి మరీ.. ఎంతో మంది ఎన్నో చెప్పారు. ఎర్త్‌ ఎండ్‌పై ఎన్నో థియరీలు తెరపైకి వచ్చాయి.

NASA: అది తగిలితే.. అంతా తుడిచిపెట్టుకుపోతుంది.. భూమిని ఢీ కొట్టనున్న భారీ గ్రహశకలం..
Bennu
Sanjay Kasula
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 14, 2021 | 7:44 PM

Share

మనం మన రోజువారీ పనుల్లో బిజీ ఉంటున్నాం. రాత్రయితే నిశ్చింతగా నిద్రపోతున్నాం..! కానీ.. మనకు తెలియకుండానే ఎన్నో గండాలను తప్పించుకుంటున్నామో లెక్కేలేదు. గత నెల, అంతకుముందు నెల, గతేడాది… చెప్పుకుంటూ పోతే.. దినదినగండం మనకు తెలియకుండానే తప్పిపోతోంది. అయితే.. ఇప్పుడు మళ్లీ భయపెడే రోజు రానే వచ్చింది. ఎన్నో అద్భుతాలకు నెలవైన అనంత విశ్వం నుంచి.. డేంబర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. భూమి వైపునకు దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్స్‌ ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. తాజాగా… మరో గ్రహశకలం హడలెత్తిస్తోంది. తాజాగా దూసుకొస్తున్న ఆ ఆస్ట్రాయిడ్‌తో భూమి ముప్పు పొంచివుందా..?

భూమిని ఓ భారీ గ్రహశకలం ఢీకొట్టనుంది. దాదాపు 500 మీటర్ల వ్యాసం కలిగిన బెన్ను అనే ఓ భారీ శకలం భూమి మరికొన్నేళ్లలో ఢీకొంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కచ్చితంగా చెబుతోంది. ఈ గ్రహశకలం ప్రతి 436.604 రోజులకు ఒకసారి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. అలాగే ప్రతి 6ఏళ్లకు భూమికి చేరువగా వస్తోంది. ఈ క్రమంలోనే 2200లో ఈ బెన్ను గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా తొలుత వెల్లడించింది. ఈ బెన్ను గ్రహశకలం కదలికలపై ఐదేళ్లుగా నాసా పరిశోధన చేస్తోంది. అందులో భాగంగానే బెన్నుపై మరింత పరిశోధనలు జరిపేందుకు 2016లో ఒసైరిస్-రెక్స్ అనే వ్యోమనౌకను ప్రయోగించింది.

నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2020 అక్టోబర్‌ 21న ఒసైరిస్-రెక్స్ విజయవంతంగా బెన్ను గ్రహశకలంపై ల్యాండ్ అయింది. అప్పటి నుంచి ఆ గ్రహశకలంపై ఉన్న నమూనాలను సేకరించి.. దాని కదలికల్ని అంచనా వేస్తూ సమచారాన్ని నాసాకు అందిస్తోంది.

తాజాగా ఒసైరిస్-రెక్స్ అందించిన కీలక విషయాల ఆధారంగా 2300లో ఈ గ్రహశకలం భూమని ఢీకొంటుంని ప్రకటించింది. బెన్ను గ్రహశకలం భూమికి సుమారు 29.3 కోట్ల కి.మీ. దూరంలో ఉందని, ఇది భూమికి అంగారకుడికి మధ్య ఉన్న దూరంతో సమానమని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గ్రహశకలం నుంచి ఒసైరిస్ రెక్స్ సేకరించిన నమూనాల వివరాలు 2023 నాటికి భూమికి చేరుకుంటాయని, అప్పుడు మరింత స్పష్టంగా సమాచారం తెలుస్తుందని వారంటున్నారు.

ఇదిలా ఉంటే మరికొంత మంది శాస్త్రవేత్తలు బెన్ను గ్రహశకలం వరకు అవసరం లేదని, అంతకుముందే మానవాళిని తుడిచిపెట్టేసే మరో గ్రహశకలం ‘అపోఫిస్’ భూమి వైపుగా దూసుకొస్తోందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2068 లో ఈ అపోపిస్ గ్రహశకలం భూమికి అతి చేరువగా వస్తుందని, ఢీకొట్టే అవకాశాలు కూడా అత్యంత ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. యార్కోవ్‌స్కీ ఎఫెక్ట్ ప్రయోగం ద్వారా ఈ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: Krishna District: ‘జామకాయ’ ఆ పసిపాప జీవితాన్ని అర్ధాంతరంగా చిదిమేసింది

viral video: శివంగిలా మారిన మహిళ.. యువకుడిని కిందపడేసి మరీ చితకబాదేసింది.. ఎందుకో తెలుసా..

సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ

హిజ్రాపై మోజుపడ్డ యువకుడు.. మాట ముచ్చటతో దగ్గరయ్యారు.. తనను దూరం చేయడం తట్టులేక..