IND vs ENG 2nd Test: ఐదేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడాడు.. మొదటి బంతికే గోల్డెన్ డక్.. 75 సంవత్సరాల చెత్త రికార్డుకు బ్రేక్

IND vs ENG: ఇంగ్లండ్‌కు చెందిన ఈ బ్యాట్స్‌మన్ మొట్టమొదటి బంతికే మహ్మద్ సిరాజ్‌కు బలి అయ్యాడు.

IND vs ENG 2nd Test: ఐదేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడాడు.. మొదటి బంతికే గోల్డెన్ డక్.. 75 సంవత్సరాల చెత్త రికార్డుకు బ్రేక్
Siraj Wicket
Follow us
Venkata Chari

|

Updated on: Aug 13, 2021 | 10:27 PM

IND vs ENG: ఒక బ్యాట్స్‌మన్ 1717 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. ఐదేళ్ల తరువాత తిరిగి రావడం నిరాశపరిచింది. అతను మొదటి బంతికే బౌల్డ్ అయ్యాడు. ఐదేళ్ల క్రితం తన చివరి టెస్టులో యాభై పరుగులు చేశాడు. రీఎంట్రీలో మాత్రం డకౌట్ అయ్యాడు. ఇండియా వర్సె్స్ ఇంగ్లండ్ టీంల మధ్య లార్డ్స్ టెస్ట్‌లో రెండో రోజు జరిగింది. ఆ బ్యాట్స్‌మన్‌ పేరు హసీబ్ హమీద్. ఈ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మొదటి బంతికే మహ్మద్ సిరాజ్‌కు బలి అయ్యాడు. భారత బౌలర్ ఈ బ్యాట్స్‌మన్‌ను బౌల్డ్ చేశాడు. ఖాతా తెరవకుండానే మొదటి బంతికే హసీబ్ హమీద్ ఔట్ అయినప్పుడు ఒక ప్రత్యేకమైన రికార్డు కూడా చేరింది. ఈ విధంగా హసీబ్ హమీద్ పేరు చెత్త కారణాలతో రికార్డు పుస్తకంలోకి ఎక్కింది.

లార్డ్స్ టెస్టులో హసీబ్ హమీద్ నంబర్ త్రీ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఓపెనర్ డోమ్ సిబ్లే నిష్క్రమణ తర్వాత అతను బరిలోకి దిగాడు. కానీ మొహమ్మద్ సిరాజ్ మొదటి బంతికే అతడిని బౌల్డ్ చేశాడు. గత 75 సంవత్సరాలలో భారతదేశంపై గోల్డెన్ డక్‌గా ఔటయిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతని ముందు చివరిసారిగా 1946 లో డెన్నిస్ కాంప్టన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గోల్డెన్ డక్ అయ్యాడు. అతడిని లాల్ అమర్‌నాథ్ పెవిలియన్ చేర్చాడు. అతని తరువాత, హసీబ్ హమీద్ ఇప్పుడు నంబర్ త్రీలో ఆడుతున్నప్పుడు మొదటి బంతికే అవుట్ అయ్యాడు. ఆసక్తికరంగా, లార్డ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కాంప్టన్, హమీద్ ఇద్దరూ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరడం విశేషం.

2016 లో భారత్‌పై అరంగేట్రం హసీబ్ హమీద్ ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ టెస్టులో చోటు దక్కించుకున్నాడు. అతను 2016 లో భారత పర్యటనతో టెస్ట్ అరంగేట్రం చేశాడు. అప్పుడు అతను అప్పటికే ఓ మ్యాచ్‌లో ఒక అర్ధశతకం సాధించాడు. ఆ పర్యటనలో చివరి మ్యాచ్‌లో గాయపడ్డాడు. కానీ, అతను బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగాడు. గాయపడిన తర్వాత కూడా, అతను పోరాడుతూ బ్యాటింగ్ చేశాడు. యాభై పరుగులు చేశాడు. దీని తర్వాత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడిని కలుసుకుని ప్రశంసించాడు.

కానీ భారత పర్యటన తర్వాత, హసీబ్ హమీద్ కెరీర్ దిగజారింది. అతను తన ఫామ్‌ను కోల్పోయాడు. కౌంటీ క్రికెట్‌లో కూడా తన స్థానాన్ని కోల్పోయాడు. దాదాపు నాలుగు సంవత్సరాల పోరాటం తరువాత 2021 సంవత్సరంలో తిరిగి వచ్చాడు. ఈ ఏడాది అతను కౌంటీ క్రికెట్‌లో మంచి పరుగులు చేశాడు. దాంతో టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. భారతదేశంతో నాటింగ్‌హామ్ టెస్టులో జాక్ క్రాలీ, డాన్ లారెన్స్ పేలవ ప్రదర్శన తర్వాత హసీబ్ హమీద్‌ను జట్టులోకి తీసుకున్నారు.

Also Read: T20 World Cup: సెప్టెంబర్ 10 లోపు టీంలను పంపండి.. టీ20 ప్రపంచ కప్‌లో ఆటగాళ్ల పరిమితిపై ఐసీసీ ఆంక్షలు

IND vs ENG: ఓపెనర్ల శ్రమను వృథా చేస్తోన్న ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు.. ఫాంలేమితో టీమిండియా ఓటమికి కారకులు.. వారెవరంటే?