- Telugu News Photo Gallery Cricket photos Ind vs Eng Lords test Ajinkya Rahane Virat kohli Cheteshwar Pujara form worry for teamindia
IND vs ENG: ఓపెనర్ల శ్రమను వృథా చేస్తోన్న ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు.. ఫాంలేమితో టీమిండియా ఓటమికి కారకులు.. వారెవరంటే?
ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో టీమిండియా మిడిల్ ఆర్డర్ బలహీనత బయటపడింది. మొదటి టెస్టులో ఇక్కడ ఆడిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు 9 పరుగులు చేశారు. ప్రస్తుతం లార్డ్స్‌లో 52 పరుగులు చేశారు.
Updated on: Aug 13, 2021 | 9:36 PM

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌తో బిజీగా ఉంది. సిరీస్‌లో రెండో మ్యాచ్ లార్డ్స్‌లో జరుగుతోంది. కానీ, మొదటి రెండు టెస్టులతో భారత జట్టు ముందు పెద్ద సమస్య తలెత్తింది. ఈ సమస్యకు కారణం విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, చేతేశ్వర్ పుజారా. ఈ ముగ్గురు భారతదేశంలో సీనియర్ మోస్ట్ బ్యాట్స్‌మెన్స్. కోహ్లీ, పుజారా, రహానే ఫాంలో లేక పరుగులు సాధించేందుకు కష్టపడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ సమస్య మొదలైంది. ప్రస్తుతం అది ఇంగ్లండ్‌లో కూడా కొనసాతోంది. లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో పుజారా తొమ్మిది, కోహ్లీ 42, రహానే ఒక పరుగు సాధించారు. అంటే, భారత మిడిల్ ఆర్డర్ నుంచి కేవలం 52 పరుగులు మాత్రమే వచ్చాయి. దీని కారణంగా, టీమ్ ఇండియా 500 పరుగులు చేసే అవకాశం జారిపోయింది.

ముందుగా, టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా నంబర్ త్రీ బ్యాట్స్‌మన్ చేతేశ్వర్ పుజారా గురించి మాట్లాడుకుందాం. లార్డ్స్ టెస్టులో అతను జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అతను తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు. అతను జానీ బెయిర్‌స్టో స్లిప్‌లో క్యాచ్ అందుకోవడంతో ఔటయ్యాడు. ప్రస్తుతం ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. 2020 నుంచి చెతేశ్వర్ పుజారా రికార్డును పరిశీలిస్తే, గత 23 ఇన్నింగ్స్‌లో కేవలం 552 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో పుజారా సగటు 25.09గా నమోదైంది. అతని పేరుపై కేవలం ఐదు అర్ధ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అత్యధిక స్కోర్ విషయానికి వస్తే 77 పరుగులుగా ఉంది. ఈ కాలంలో పుజారా ఖాతా తెరవకుండానే రెండుసార్లు ఔట్ అయ్యాడు. పుజారా చివరి టెస్టు సెంచరీ జనవరి 2019లో నమోదైంది.

పుజారా పరిస్థితి విషమంగా ఉంటే, కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అతను జనవరి 2020 నుంచి 16 ఇన్నింగ్స్‌లలో 387 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కోహ్లీ సగటు 24.18గా నమోదైంది. అత్యధిక స్కోరు 74 పరుగులు. కోహ్లీ గత 19 నెలల్లో కేవలం మూడు అర్ధ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. దీనితో పాటు, అతను మూడుసార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కోహ్లీ చివరిగా నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌పై టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ సాధించాడు.

rahane

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో, భారత ఓపెనింగ్ జంట 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కానీ పుజారా (4), కోహ్లీ (0), రహానే (5) పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరారు. ఈ కారణంగా స్కోరు నాలుగు వికెట్లకు 112 పరుగులు మాత్రమే చేశారు. లార్డ్స్ టెస్టులో, మొదటి వికెట్ 126 పరుగులకు పడింది. కానీ, 282 పరుగులకే ఐదు వికెట్లు పడ్డాయి. ఇటువంటి తప్పులు భారతదేశానికి చాలా ఖరీదైనవి. ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండో దశ ప్రారంభమైంది. చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానేల ఆట ఇలాగే కొనసాగితే, అప్పుడు టీమిండియాకు గడ్డు పరిస్థితే ఎదుర్కానుంది. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఇంకా మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. దీని తర్వాత న్యూజిలాండ్‌తో హోం సిరీస్ జరగనుంది.




