AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: సెప్టెంబర్ 10 లోపు టీంలను పంపండి.. టీ20 ప్రపంచ కప్‌లో ఆటగాళ్ల పరిమితిపై ఐసీసీ ఆంక్షలు

2016 సంవత్సరం తర్వాత మొదటిసారిగా టీ 20 ప్రపంచకప్ యూఏఈలో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరుగుతుంది.

T20 World Cup: సెప్టెంబర్ 10 లోపు టీంలను పంపండి.. టీ20 ప్రపంచ కప్‌లో ఆటగాళ్ల పరిమితిపై ఐసీసీ ఆంక్షలు
Icc T20 World Cup 2021
Venkata Chari
|

Updated on: Aug 13, 2021 | 9:58 PM

Share

యూఏఈలో జరిగే టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు 15 మంది ఆటగాళ్లు, ఎనిమిది మంది అధికారులను తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అనుమతించింది. ఈమేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) అధికారి శుక్రవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే దేశాలు తమ స్వార్డ్‌‌లోని 15 మంది ఆటగాళ్లతోపాటు కోచ్, సహాయక సిబ్బంది సహా ఎనిమిది మంది అధికారుల జాబితాను పంపాలంటే ఐసీసీ సెప్టెంబర్ 10 వరకు గడువు విధించిందని ఆ అధికారి తెలిపారు. ఈ అధికారి పీటీఐతో మాట్లాడుతూ, ‘టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాలకు కోవిడ్ -19, బయో-బబుల్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జట్టుతో అదనపు ఆటగాళ్లను తీసుకురావడానికి ఐసీసీ అనుమతించింది. అయితే దీనికి అయ్యే ఖర్చును ఆయా బోర్డులే భరించాలని పేర్కొంది. 15 మంది ఆటగాళ్లు, ఎనిమిది మంది అధికారుల ఖర్చులను మాత్రమే ఐసీసీ భరిస్తుందని పేర్కొన్నారు.

2016 సంవత్సరం తర్వాత మొదటిసారిగా టీ 20 ప్రపంచకప్ ఒమన్, యూఏఈ (దుబాయ్, అబుదాబి, షార్జా) లో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరుగుతుంది. ఎనిమిది దేశాల క్వాలిఫయింగ్ టోర్నమెంట్ సెప్టెంబర్ 23 నుంచి జరుగుతుంది. ఇందులో శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్లు కూడా ఉన్నాయి. ఇందులో నాలుగు జట్లు సూపర్ -12 దశకు అర్హత సాధిస్తాయి. “కోవిడ్ -19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎంత మంది అదనపు ఆటగాళ్లను తన ప్రధాన బృందంలో ఉంచాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలని” ఐసీసీ పేర్కొన్నట్లు అధికారి తెలిపారు. ప్రధాన జట్టులోని ఆటగాడు కోవిడ్ -19 పరీక్షలో పాజిటివ్‌గా వచ్చినా లేదా గాయపడినా, అదనపు ఆటగాళ్లలో ఒకరు అతని స్థానాన్ని భర్తీ చేసుకోవచ్చని తెలిపారు.

సెప్టెంబర్ 10 లోపు లిస్టును పంపాలి టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే దేశాలు తమ జాబితాను సెప్టెంబర్ 10లోపు పంపాలని ఐసీసీ పేర్కొనట్లు ఆయన తెలిపారు. అయితే వారి అక్కడకు బయలుదేరే ఐదు రోజుల ముందు వరకు ఈ లిస్టులో మార్పులు చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ భారతదేశంలో జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ -19 పరిస్థితి కారణంగా, ఐసీసీ, బీసీసీఐలు యూఏఈకి తరలించిన సంగతి తెలిసిందే. అయితే హోస్టింగ్ మాత్రం బీసీసీఐ చేతిలోనే ఉంది.

Also Read:

IND vs ENG: ఓపెనర్ల శ్రమను వృథా చేస్తోన్న ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు.. ఫాంలేమితో టీమిండియా ఓటమికి కారకులు.. వారెవరంటే?

Khel Duniya With Satya: ఒలింపిక్స్‌‌‌లో క్రికెట్ ఎందుకు లేదో తెలుసా?.. అయితే ఈ వీడియో చూడండి…

నీ బ్యాటింగ్‌లో దమ్ము లేదు.. విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలంటూ సలహా.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే?

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ