TS Corona Cases: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 427 మందికి పాజిటివ్, ఇద్దరు మృతి
కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి.
Telangana Covid 19 Cases Today: కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారి నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా దిగివస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,51,715 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా మహమ్మారి ధాటికి మరో ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3,838 మంది కరోనా కాటుకు బలయ్యారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని.. 609 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తంగా 6,40,065 మంది కోవిడ్‌ను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇక, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 7,812 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 6, జీహెచ్ఎంసీ 68, జగిత్యాల 16, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల 2, కామారెడ్డి 2, కరీంనగర్ 43, ఖమ్మం 23, మహబూబ్‌నగర్ 5, కొమురంభీం ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 6, మంచిర్యాల 15, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 28, ములుగు 4, నాగర్ కర్నూల్ 4, నల్గగొండ 26, నారాయణపేట 2, నిజామాబాద్ 6, పెద్దపల్లి 22, రాజన్న సిరిసిల్ల 15, రంగారెడ్డి 21, సిద్దిపేట 13, సంగారెడ్డి 3, సూర్యాపేట 14, వికారాబాద్ 1, వనపర్తి 4, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ 41, యాదాద్రి భువనగిరిలో 7 చొప్పున కేసులు నమోదయ్యాయి.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని, వచ్చే నెలలో అత్యధిక కేసులు నమోదయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది.