మాస్కులు తప్పనిసరి ! చైనాలో ప్రజలకు నూతన మార్గదర్శక సూత్రాలు జారీ

తమ దేశంలోని ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ చైనా ప్రభుత్వం కొత్త మార్దర్శక సూత్రాలను జారీ చేసింది. డెల్టా వేరియంట్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతో నేషనల్ హెల్త్ కమిషన్ తాజాగా కొత్త గైడ్ లైన్స్ ని విడుదల చేసింది.

మాస్కులు తప్పనిసరి ! చైనాలో ప్రజలకు నూతన మార్గదర్శక సూత్రాలు జారీ
New Guidelines For Masks In China
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 14, 2021 | 9:43 AM

తమ దేశంలోని ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ చైనా ప్రభుత్వం కొత్త మార్దర్శక సూత్రాలను జారీ చేసింది. డెల్టా వేరియంట్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతో నేషనల్ హెల్త్ కమిషన్ తాజాగా కొత్త గైడ్ లైన్స్ ని విడుదల చేసింది. ఈ కేసులు మరిన్ని పెరగకుండా చూడాల్సి ఉందని, అందువల్ల ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. దేశంలో ఇప్పటికే పలు నగరాల్లో కఠినమైన లాక్ డౌన్లను విధించారు. ట్రావెల్ ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. బీజింగ్ సహా పలు రాష్ట్ర రాజధానుల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవి పరిమితంగా తిరగాలని, టాక్సీలు వంటి వాహనాలు జనాలను ఎక్కువ సంఖ్యలో ఎక్కించుకోరాదని ఈ ఆంక్షల్లో సూచించారు. ఇటీవలి వరకు అనేక టూరిస్టు ప్రదేశాల్లో పర్యాటకులు, ప్రజలు మాస్కులు లేకుండా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతివారూ ఇళ్లలో ఉన్న, బయట ఉన్నా, షాపింగ్ మాల్స్, ఎగ్జిబిషన్ హాల్స్, పార్కులు వంటిచోట్ల ఎక్కడ ఉన్నా మాస్కుల ధారణ తప్పనిసరి అని ఈ గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. అమెరికా వంటి దేశాలు కూడా ఈ నిబంధనలను ఇప్పటికే అమలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఇది అనివార్యమని పేర్కొన్నాయి. అదే కోవలో చైనాలోని నేషనల్ హెల్త్ కమిషన్ కూడా పయనిస్తోంది.

వ్యాక్సిన్ తీసుకుంటే ఇక ఇవి అవసరం లేదన్న భావన ప్రజల్లో ఉందని, కానీ ఇది తప్పని ఈ కమిషన్ పేర్కొంది. సూపర్ మార్కెట్లు, ఎయిర్ పోర్టులు,..ఎక్కడైనా సరే ప్రజలు మాస్కులతో కనిపించాలంటున్నారు. యాంగ్ జూ నగరంలో లక్షలాది ప్రజలు టెస్టింగులు చేయించుకున్నారు. ఉదాహరణకు ఇప్పటికే ఇక్కడ ఏడు రౌండ్ల టెస్టింగులు పూర్తయ్యాయి. ఈ నగరంలో నిన్న 25 కొత్త కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. 770 మిలియన్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇది 55 శాతమట.. మరింతమంది టీకామందు తీసుకోవలసి ఉందని ఈ కమిషన్ పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Coronavirus India: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?

ఆఫ్గనిస్తాన్ లో తక్షణమే పోరు ఆపాలని తాలిబన్లకు ఐరాస పిలుపు.. శాంతి నెలకొనేలా చూస్తామని హామీ