AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫ్గనిస్తాన్ లో తక్షణమే పోరు ఆపాలని తాలిబన్లకు ఐరాస పిలుపు.. శాంతి నెలకొనేలా చూస్తామని హామీ

ఆఫ్గనిస్తాన్ లో ఆ దేశ దళాలపై పోరును ఆపాలని, పౌర యుద్దాన్ని నివారించాలని ఐక్యరాజ్యసమితి హెడ్ ఆంటోనియో గెటర్స్ తాలిబన్లకు పిలుపునిచ్చారు.

ఆఫ్గనిస్తాన్ లో తక్షణమే పోరు ఆపాలని తాలిబన్లకు ఐరాస పిలుపు.. శాంతి నెలకొనేలా చూస్తామని హామీ
Talibans
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Aug 14, 2021 | 9:40 AM

Share

ఆఫ్గనిస్తాన్ లో ఆ దేశ దళాలపై పోరును ఆపాలని, పౌర యుద్దాన్ని నివారించాలని ఐక్యరాజ్యసమితి హెడ్ ఆంటోనియో గెటర్స్ తాలిబన్లకు పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పట్ల విశ్వాసం చూపాలని, శాంతి నెలకొనేందుకు చర్చలు ముఖ్యమని, ఈ విషయంలో అవసరమైతే తాము జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. గత ఎన్నో దశాబ్దాలుగా ఆఫ్ఘన్ యుద్దాలు, ఘర్షణలతో అట్టుడుకుతూ వచ్చిందన్నారు. దీర్ఘకాలంగా ఆ దేశ ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని ఆయన చెప్పారు. న్యూయార్క్ లో మీడియాతో మాట్లాడిన ఆంటోనియో.. తాలిబన్లు వివిధ ప్రాంతాలను ఆక్రమించుకుంటూ అమాయక ప్రజలను వేధించడం ఆపాలన్నారు. ఇప్పటికే సుమారు రెండున్నర లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్ళు వదిలి పారిపోయారన్నారు. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయని, ఆహారం, వైద్య సంబంధ సదుపాయాలు క్రమంగా తగ్గిపోతున్నాయన్నారు. రోడ్లు, బ్రిడ్జీలను, క్లినిక్ లను వారు నాశనం చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించేందుకు అన్ని పార్టీలు, పక్షాలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఆఫ్ఘన్ సమస్యకు రాజకీయ పరిష్కారం ముఖ్యమన్నారు.

అక్కడ శాంతి నెలకొనేలా చూసేందుకు మేము అన్ని విధాలా యత్నిస్తాం.. మొదట చర్చలకు తాలిబన్లు ముందుకు రావాలి అని ఆంటోనియో అన్నారు. కాగా ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు ఇప్పటికే 34 రాష్ట్రాలకు గాను 18 రాష్ట్రాలను తమ వశం చేసుకున్నారు. మొత్తం దేశంలో 65 శాతం నగరాలు, పట్టణాలు వారి వశమయ్యాయి. కాందహార్, హెరాత్,లష్కర్ గా, కుందుజ్ వంటి పెద్ద రాష్ట్రాలు వీటిలో ఉన్నాయి. కుందుజ్ లోని విమానాశ్రయాన్ని వీరు మూడు రోజుల క్రితమే హస్తగతం చేసుకున్నారు. ఇలా ఉండగా ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని తమ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఆయన రాజీనామా చేయాలనీ తాలిబన్లతో బాటు పాకిస్థాన్ కూడా డిమాండ్ చేస్తోంది. తాలిబన్లతో అధికారాన్ని పంచుకునేందుకు ఆఫ్ఘన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా వార్తలు వచ్చాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. గృహ రుణాలపై కీలక ప్రకటన.. ఏంటంటే.?

Delta Plus variant: మహారాష్ట్రలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్.. ఐదుగురు మృతి.. కేసులు ఎన్నంటే..?