AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Libraries: పుస్తకాల భాండాగారం ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రెరీ, అతి ప్రాచీన గంథాలయం ఎక్కడ ఉందో తెలుసా

Best Libraries: సంపదను దాచుకోగలడేమోగానీ, మనిషి జ్ఞానాన్ని దాచిపెట్టలేడు. తాను కనుక్కున్నదీ, అనుభవించిందీ, ఆలోచించిందీ ఎదుటివారితో పంచుకోవాలనే తపనే భాష, లిపి పుట్టుకలకు కారణం..

Best Libraries: పుస్తకాల భాండాగారం ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రెరీ, అతి ప్రాచీన గంథాలయం ఎక్కడ ఉందో తెలుసా
Ancient Library
Surya Kala
|

Updated on: Aug 14, 2021 | 9:04 AM

Share

Best Libraries: సంపదను దాచుకోగలడేమోగానీ, మనిషి జ్ఞానాన్ని దాచిపెట్టలేడు. తాను కనుక్కున్నదీ, అనుభవించిందీ, ఆలోచించిందీ ఎదుటివారితో పంచుకోవాలనే తపనే భాష, లిపి పుట్టుకలకు కారణం. రాసిన అన్నింటినీ నిర్దేశిత స్థలంలో అందరికీ అందుబాటులో ఉంచాలనే ప్రాథమికభావనే గ్రంథాలయాలకు మూలం. ప్రజల ఉపయోగార్ధం అన్నిరకాల పుస్తకాలను ఒకేచోట చేర్చి రక్షించే ప్రదేశాన్ని గ్రంథాలయం అని అంటారు. ఈ గ్రంథాలయాలు క్రీస్తుపూర్వం 2600ల్లోనే ఉండేవనడానికి ఆధారాలను పురాతత్వ పరిశోధకులు సంపాదించారు. కాగితం పుట్టకముందే, మట్టి పలకల రాతల్ని సుమేర్(ఆధునిక ఇరాక్ ప్రాంతం)లో కనుక్కున్నారు. కాగితం కనుక్కున్న తర్వాత ‘ప్రపంచ రాతే’ మారిపోయింది. ఎందరో సామ్రాజ్యాధిపతులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న దర్శనాలను, ఆవిష్కరణలను తమ భాషలో తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. అలాంటి పుస్తకాల భాండాగారం ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రెరీ, అతి ప్రాచీన గంథాలయం ఎక్కడ ఉందొ తెలుసుకుందాం..

ప్రపంచంలో అతి పెద్ద గ్రంథాలయం:

అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డి.సి.లోని ‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’లో సుమారు 15 కోట్ల ఐటెమ్స్ ఉన్నాయి. ఇందులో పుస్తకాలు, డీవీడీలు, మ్యాపులు, ఫిలింలు, ప్రింట్లు, ఆడియోబుక్స్, ఇంకా ఇతరత్రా జ్ఞానపేటికలన్నీ లెక్కే! పుస్తకాలనే విడిగా గణిస్తే సుమారు 2.2 కోట్లు! 1800 సంవత్సరంలో నెలకొల్పిన దీన్ని అతి పురాతన సాంస్కృతిక నిలయంగా అమెరికన్లు పరిగణిస్తారు. ఏటా 17.5 లక్షల మంది సందర్శిస్తారు. సుమారు 3600 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తారు.

అలాగే, బ్రిటన్ రాజధాని లండన్‌లో ఉన్న ‘బ్రిటిష్ లైబ్రరీ’ కూడా 15 కోట్ల ఐటెమ్స్‌తో కళకళలాడుతుంటుంది. ఇందులో సుమారు 1.4 కోట్ల పుస్తకాలు! క్రీ.పూ.2000 నాటి మాన్యుస్క్రిప్టులు, చారిత్రక ఆధారాలు కూడా ఇక్కడ భద్రంగా ఉండటం దీని ఘనతను చాటుతుంది.

ప్రాచీన గ్రంథాలయాలు:

ఐదవ శతాబ్దంలో కాన్‌స్టంట్‌నోపుల్‌లోని ఇంపీరియల్ లైబ్రరీ 1,20,000 పుస్తకాలతో ఐరోపాలోనే పెద్ద గ్రంథాలయంగా వినుతికెక్కింది. అయితే, 477వ సంవత్సరంలో అది పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయింది. తిరిగి నిర్మించినప్పటికీ 726లో ఒకసారి, మళ్లీ 1204 లో మరోసారి, చివరకు 1453లో పూర్తిగా నాశనమైపోయింది. ఇప్పటికీ ఉన్న అత్యంత పురాతన గ్రంథాలయంగా చైనాలోని ‘తియాన్ యి జె’ ప్రసిద్ధి. దీన్ని మింగ్ వంశస్థుల కాలంలో 1561లో ఫాన్ క్విన్ స్థాపించాడు. దీని ఉచ్ఛ దశలో 70,000 ప్రాచీన పుస్తకాలుండేవి. దీని నమూనాలోనే దేశంలోని ప్రశస్త జాతీయ లైబ్రరీలను చైనా నిర్మించుకుంది. బ్రిటన్‌తో జరిగిన యుద్ధం అప్పుడూ, స్థానిక దొంగతనాల వల్లా ఇది చాలా పుస్తకాల్ని కోల్పోయింది. అయినప్పటికీ జాతీయ వారసత్వ సంపదగా అక్కడ గౌరవం పొందుతోంది.

Also Read: Cactus Juice: శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే కాక్టస్ జ్యూస్ రెసిపీ.. దీనిని తాగడం వలన ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా