AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccine Pregnant: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే గర్భిణీలకు ఏమైనా ప్రమాదామా.? అమెరికా శాస్ర్తవేత్తలు ఏం చెబుతున్నారు..

Vaccine Pregnant: ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ తర్వాత ఇప్పుడిప్పుడే బలహీన పడుతున్నట్లు కనిపిస్తోంది. రెండో వేవ్‌లో లక్షల మందిని బలిగొన్న ఈ మాయదారి రోగం...

Vaccine Pregnant: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే గర్భిణీలకు ఏమైనా ప్రమాదామా.? అమెరికా శాస్ర్తవేత్తలు ఏం చెబుతున్నారు..
Vaccination
Narender Vaitla
|

Updated on: Aug 14, 2021 | 8:35 AM

Share

Vaccine Pregnant: ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ తర్వాత ఇప్పుడిప్పుడే బలహీన పడుతున్నట్లు కనిపిస్తోంది. రెండో వేవ్‌లో లక్షల మందిని బలిగొన్న ఈ మాయదారి రోగం ఇప్పుడు కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. అయితే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మళ్లీ థర్డ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పెద్ద ఎత్తున చేపడుతున్నాయి ప్రభుత్వాలు. ప్రజలు కూడా వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ప్రారంభంలో కొందరు వ్యాక్సిన్‌ వేసుకోవడానికి కాస్త అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడిప్పుడే అందులో మార్పులు వస్తున్నాయి. భారీ ఎత్తున వ్యాక్సినేషన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే గర్భిణీలు వ్యాక్సిన్‌ తీసుకోవడంపై ఇప్పటికీ కొందరిలో అనుమానం ఉంది. మరీ ముఖ్యంగా అమెరికాలో పలు అనుమానాలు వ్యక్తమవుతోన్న వేళ అక్కడి పరిశోధకులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడం వతల్ల గర్భధారపై ఎలాంటి ప్రభావం చూపదని అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకోవడం గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయనేది కేవలం అపనమ్మకమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ఫైజర్‌ కంపెనీ పరిశోధనల చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రుతుక్రమంలోనే మార్పులు వచ్చాయని చెప్పిన మహిళలను సైతం పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలను పరిశోధకులు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ విషయమై.. యేల్‌ వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిల్‌ ప్రొఫెసర్, గైనకాలజిస్టు మేరీ జేన్‌ మిన్‌కిన్‌ మాట్లాడుతూ వ్యాక్సిన్‌ల వల్ల గర్భధారణకు ఎలాంటి సమస్య రాదని చెప్పారు. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేస్తున్న వారు, చికిత్స తీసుకుంటున్న వారు టీకా వేసుకోవాలని ఎమోరీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ డెనిస్‌ జమైసన్‌ తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీఎస్‌) గర్భిణులు వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఇదివరకే సిఫారసు చేసింది.

Also Read: Megha Akash: ఆ విషయంలో అమ్మ, నాన్నల సలహాలు అస్సులు తీసుకోను నా ఇష్టమే ఫైనల్‌.. మేఘా ఆకాష్‌ .

AP Crime: శ్రీకాకుళం తీరంలో విషాదం.. పడవ బోల్తా.. ముగ్గురు మత్స్యకారుల గల్లంతు.. ఒకరు మృతి

Supritha: షాంపెన్‌ పొంగించి.. పార్టీలో రచ్చ చేసిన సురేఖ వాణీ కూతురు.. వైరల్ అవుతున్న వీడియో..