Amara Raja: అమర రాజా ఫ్యాక్టరీ తరలింపుపై తొలిసారిగా స్పందించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.. ఎమన్నారంటే..?
అమరరాజా బ్యాటరీ ఫ్యాక్టరీ తరలి పోవడంపై వస్తున్న వార్తలు రూమర్లు మాత్రమేనని కొట్టిపారేశారు టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్.
Galla Jayadev on Amararaja Batteries: అమరరాజా బ్యాటరీ ఫ్యాక్టరీ తమిళనాడుకు తరలి పోవడంపై వస్తున్న వార్తలు రూమర్లు మాత్రమేనని కొట్టిపారేశారు టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్. అమరరాజా ఫ్యాక్టరీ తరలింపుపై ఆయన తొలిసారిగా స్పందించారు. తాజా వివాదాలపై కోర్టులో వాదనలు వినిపిస్తున్నామని, కోర్టుల పట్ల గౌరవం ఉందన్నారు గల్లా జయదేవ్. ఉద్యోగులకు, వాటాదారులకు మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని అమయూనిట్లను మూసివేయాలనిపొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వెంటనే విద్యుత్ ను కూడా కట్ చేసి ఫ్యాక్టరీ కార్యకలాపాలను నిలిపివేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఫ్యాక్టరీని తరలించాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది.
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనేకమార్లు ఆరోపణలు చేసింది. జగన్ రెడ్డి జే ట్యాక్స్ కు భయపడి రాష్ట్రానికి రావాల్సిన సంస్థలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని గత కొంతకాలంగా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వివిధ ఫ్యాక్టరీలు కూడా దుకాణం ఎత్తేస్తున్నాయని, పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నాయని, దాని వల్ల రాష్ట్రంలో చాలా మంది ఉపాధి కోల్పోతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు అమరరాజా బ్యాటరీ కంపెనీ వ్యవహారంతో ఆందోళన బాట పట్టారు.
ఇదిలావుంటే, అమర రాజా కంపెనీ బ్యాటరీల నుండి వచ్చే లెడ్వల్ల తీవ్రమైన జల కాలుష్యం జరుగుతోందని పేర్కొన్న కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసు జారీ చేసింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించిన చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, తిరుపతి కరకంబాడి యూనిట్లను మూసివేయాలనిపొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వెంటనే విద్యుత్ ను కూడా కట్ చేసి ఫ్యాక్టరీ కార్యకలాపాలను నిలిపివేసింది. దీనిపై కోర్టుకు వెళ్లిన గల్లా జయదేవ్ కు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసి గల్లా జయదేవ్ ఫ్యాక్టరీకి విద్యుత్ ను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ తీరుతో అమర రాజా యజమాన్యం తమ ఫ్యాక్టరీని ఇతర రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తమిళనాడు రెడ్ కార్పెట్ పరిచి మరీ అమర రాజాను తమ రాష్ట్రానికి ఆహ్వానించింది.అన్ని వసతులు కల్పిస్తామని కూడా భరోసా ఇచ్చింది.
ఇక దీంతో మొదలైన దుమారం ఇప్పటికీ కొనసాగుతోంది. అమర రాజా వ్యవహారం పై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మొదట అమర రాజా ను తామే పొమ్మన్నామని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆ తర్వాత అమర రాజా బ్యాటరీస్ సంస్థను తాము పొమ్మనడం లేదని కాలుష్య నియంత్రణ చర్యలు పాటిస్తూ తిరిగి అనుమతి తీసుకొని నడుపుకోవచ్చని వ్యాఖ్యలు చేశారు. ఇక, అమర రాజా వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాభాల కోసమే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని ఆ కంపెనీ భావిస్తోందని రీ లొకేట్ చెయ్యాలంటే చిత్తూరులోనే మరో ఐదు వేల ఎకరాల స్థలం ఉందని స్పష్టం చేశారు. ఈ ఫ్యాక్టరీ తో పొలిటికల్‌గా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాము అమరరాజా ఏపీ వదిలి వెళ్లాలని కోరుకోవడం లేదంటూ పేర్కొన్నారు.