Flight tickets: విమానమెక్కాలంటే అవుతాయి జేబులు ఖాళీ.. టిక్కెట్ల ఛార్జీలు ఎంతగా పెరుగుతాయంటే..!

డొమెస్టిక్ విమాన ప్రయాణికులపై త్వరలో మరింత భారం పడనుంది. విమాన ఛార్జీల కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మరోసారి పెంచింది. వీటిని 9.83 నుంచి 12.82 శాతం వరకు

Flight tickets: విమానమెక్కాలంటే అవుతాయి జేబులు ఖాళీ.. టిక్కెట్ల ఛార్జీలు ఎంతగా పెరుగుతాయంటే..!
Flight tickets
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 13, 2021 | 8:00 PM

Airfares: డొమెస్టిక్ విమాన ప్రయాణికులపై త్వరలో మరింత భారం పడనుంది. విమాన ఛార్జీల కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మరోసారి పెంచింది. వీటిని 9.83 నుంచి 12.82 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలోనే ఈ పరిమితులను పెంచినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. దేశీయ విమాన ఛార్జీల పరిమితులు పెంచడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

తాజా పెంపుతో 40 నిమిషాల లోపు ప్రయాణ సమయం ఉండే ఫ్లైట్ టికెట్‌ ధర కనిష్ఠ పరిమితి 2,600 రూపాయల నుంచి 2,900లకు పెరిగింది. ఇదే ప్రయాణ సమయానికి గరిష్ఠ పరిమితిని 12.82శాతం పెంచడంతో 8,800 రూపాయలకు చేరింది. ఇక 40 నుంచి 60 నిమిషాల ప్రయాణ సమయం ఉండే ఫ్లైట్ టికెట్ ధర కనిష్ఠ పరిమితి 3,300 రూపాయలుండగా ఇప్పుడు 3,700లకు పెరిగింది. గరిష్ఠ పరిమితిని 11 వేల రూపాయలకు పెంచారు.

60 నుంచి 90 నిమిషాల ప్రయాణ సమయానికి టికెట్‌ కనిష్ఠ పరిమితి 4,500 రూపాయలుగాను.. గరిష్ఠ పరిమితిని 13 వేల 200 రూపాయలుగాను ఖరారు చేశారు. 90 నుంచి 120 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి 4,700 రూపాయలుండగా.. ఇప్పుడు 5,300 రూపాయలకు చేరింది. గరిష్ఠ పరిమితిని 12.3శాతం పెంచారు. 120 నుంచి 150 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి 6,100 రూపాయలుండగా.. ఇప్పుడు 6,700 రూపాయలకు పెరిగింది.

ఇక, ఫ్లైట్ టిక్కెట్ల గరిష్ఠ పరిమితిని 12.42శాతం పెంచారు. 150 నుంచి 180 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి 7,400 రూపాయలుండగా.. ఇప్పుడు 8,300 లకు చేరింది. గరిష్ఠ పరిమితిని 12.74శాతం పెంచారు. 180 నుంచి 210 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి 8,700 రూపాయలుండగా.. ఇప్పుడు 9,800లకు పెరిగింది. గరిష్ఠ పరిమితిని 12.39శాతం పెంచారు.

Read also: Lokesh: ‘అది ఇంటి గొడ్డలేన‌ని.. సొంతింటి వేట‌ కొడ‌వ‌లే వివేకాని వేటాడింద‌ని స్పష్టం అవుతోంది’: నారా లోకేష్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే