AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adilabad BJP Leaders: దాబా పే చర్చా.. అయ్యో హస్తం వీడి తప్పు చేశామా..?

ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఆ నలుగురు మాజీ నేతల్లో గుబులు పట్టుకుందంటా. నిన్న మొన్నటి వరకు ఊసేలేని పార్టీ ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా ఉగ్రరూపం చూపించడంతో పార్టీ మారి తప్పు చేశామే..

Adilabad BJP Leaders: దాబా పే చర్చా.. అయ్యో హస్తం వీడి తప్పు చేశామా..?
Adilabad Politics
Venkata Narayana
|

Updated on: Aug 13, 2021 | 10:19 PM

Share

Adilabad BJP Leaders in dilemma: ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఆ నలుగురు మాజీ నేతల్లో గుబులు పట్టుకుందంటా. నిన్న మొన్నటి వరకు ఊసేలేని పార్టీ ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా ఉగ్రరూపం చూపించడంతో పార్టీ మారి తప్పు చేశామే అన్న భావనలో పడిపోయారంటా నేతలు. ఏకంగా దళిత గిరిజ‌న దండోరా సభ వేళ ఆ నలుగురు నేతలు సమీక్ష సమావేశం కూడా నిర్వహించారని టాక్ జిల్లాలో జోరుగా సాగుతోంది. హస్తం కు హ్యండిచ్చి కాషాయం కౌంగిట్లోకి చేరిన ఆ నలుగురు నేతలు ఇప్పుడు తమ భవిష్యత్ రాజకీయం పై మళ్లగుళ్లాలు పడుతున్నట్టు టాక్. తన ఇలాకాలో భారీ బహిరంగ సభ జరగడం భారీ స్థాయిలో జనసమీకరణ చేసి కింది స్థాయి నాయకులు సక్సెస్ అవడంతో తొందరపాటులో పార్టీ మారి తప్పు చేశానేమోననే భావనలో ఆ నియోజక మాజీ ఎంపి తన అనుచరులతో మరో సారి చర్చల్లో మునిగిపోయారంట. కొడుకు కాంగ్రెస్ లోనే ఉన్న ఇంద్రవెళ్లి సభకు గౌర్హజరవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందట.

డైలామాలో పార్టీ మారిన నేతలు

ఇక ఆసిపాబాద్ జిల్లాలో ఈ మధ్యే కాంగ్రెస్ ను వీడి హస్తం గూటికి చేరిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థి తన మనసులో మాటను కూడా అనుచరులతో షేర్ చేసుకున్నారంట. తిరిగి కాంగ్రెస్ లోకి చేరాల వద్దా అన్న డైలామాలో ఉన్నట్టు సమాచారం. అయితే మరో వైపు దూకుడు పెంచిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నయా రథ సారథి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు మళ్లీ పునర్ వైభవం తీసుకు వచ్చి తీరుతానని.. కాంగ్రెస్ కంచుకోటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మారుస్తానని ఇంద్రవెళ్లి సభలో చెప్పడంతో కాంగ్రెస్ లోని కింది స్థాయి నాయకుల్లో కొత్త జోష్ కనిపిస్తుందట. నిన్న మొన్నటి వరకు ఎడమొహం పెడమొహం అన్నట్టుగా సాగిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు సైతం కలిసి కట్టుగా నడుస్తుండటం.. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో వరుస ప్రెస్ మీట్ లతో దూకుడు మీద కనిపిస్తుండటంతో కాంగ్రెస్ మళ్లీ మంచి రోజులు వచ్చినట్టే అనుకుంటున్నారట జిల్లా హస్తం కార్యకర్తలు.

తూర్పు టూ పశ్చిమ నయా జోష్ లో కార్యకర్తలు

నిర్మల్ జిల్లా యాత్రతో మొదలు పెట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటనను.. ఇంద్రవెళ్లి దండోరాతో తారస్థాయికి చేర్చి.. మరో 30 రోజుల్లో పశ్చిమ గడ్డ సింగరేణి అడ్డాలో మరో యాత్రను చేపట్టి ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం తేవాలన్న ఊపులో టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. ఆ బాధ్యతలను సైతం ఇంద్రవెళ్లి సభ అద్యక్ష బాద్యతలను మోసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క అప్పగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చే అక్టోబరులో నిర్వహించేందుకు కార్మిక శాఖ సన్నాహాలు చేస్తున్న తరుణంలో సింగరేణి అడ్డాలో యాత్ర చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తిరిగి పట్టుసాధించేందుకు సింగరేణి కార్మికుల సమస్యలపై పోరుయాత్ర చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఐఎన్‌టీయూసీ నేతలకు రేవంత్‌రెడ్డి సూచించినట్లు సమాచారం.

ఇదే నిజమైతే ఇక ఆసిపాబాద్ , మంచిర్యాల జిల్లాలో తమ ఉనికి ప్రశ్నార్దకం అవడం ఖాయమని ఈ మధ్యే కాంగ్రెస్ ను వీడిన నేతలు భావిస్తున్నారట. ఓ మాజీ మంత్రి అయితే రేవంత్ సీఎం కావాలంటూ కాషాయ గూటి నుండే పిలుపు నిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. అవసరం అయితే హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తానని.. నాలుగు నెలల తరువాత బీజేపీకి రాజీనామా చేస్తానని తన అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసి బాహాటంగానే చెపుతున్నారట. అయితే సదరు నేతకు రేవంత్ నో చెప్పారని అందుకు కాషాయ పార్టీలో నే కంటిన్యూ అవ్వాల లేక తిప్పలు పడైనా హస్తం గూటికి చేరిపోవాలా అన్న డైలామాలో ఉన్నాడట. ఏది ఏమైనా మరోసారి పోయిరావలే హస్తినకు.. మళ్లీ పునారాలోచించాలి పార్టీ మారేందుకు అని దాబాలో ఓ మాంచి సాయంత్రాన ఆ నలుగురు చర్చించినట్టు సమాచారం. అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే కాషాయానికి బైబై చెప్పేసి హస్తం పార్టీలో చేరడం పక్కా అన్న ఊహగానాలు జోరుగానే సాగుతున్నాయి.

నరేష్ స్వే‌న, టీవి9 తెలుగు, ఉమ్మడి ఆదిలాబాద్