AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Oil: ఇకపై ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌నే కాదు విద్యుత్‌ను కూడా అమ్మనుంది.. చార్జింగ్‌ స్టేషన్ల రంగంలోకి.

Indian Oil Electric Charging Station: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు లీటర్‌..

Indian Oil: ఇకపై ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌నే కాదు విద్యుత్‌ను కూడా అమ్మనుంది.. చార్జింగ్‌ స్టేషన్ల రంగంలోకి.
Indian Oil
Narender Vaitla
|

Updated on: Aug 14, 2021 | 7:22 AM

Share

Indian Oil Electric Charging Station: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 80 ఉంటేనే అబ్బా అనుకునే వాళ్లం ఇప్పుడు రూ. 100 దాటేసి, రూ. 150 దిశగా దూసుకుపోతోంది. దీంతో విద్యుత్‌ ఆధారంగా నడిచే వాహనాలను మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ తయారీ రంగాలకు పలు రాయితీలు ప్రకటించడంతో ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. మరి భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ వాహనాలు విపరీతంగా పెరిగిపోతే చార్జింగ్‌ స్టేషన్ల అవసరం కూడా అదే స్థాయిలో అవసరపడుతుంది కదా.! అప్పుడు పరిస్థితి ఏంటి? దీనికి సమాధానంగానే కొన్ని కంపెనీలు ఇప్పటికే విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్ల రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పటి వరకు ఓలా వంటి ప్రైవేటు రంగ సంస్థల పేర్లే ఇందులో ప్రధానంగా వినిపించాయి. కానీ తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ ఇందుకు సిద్ధమైంది.

కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండిన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీఎల్‌) తాజాగా విద్యుత్ చార్జింగ్ స్టేష‌న్ల రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగానే మ‌హారాష్ట్ర వ్యాప్తంగా 100 త‌మ పెట్రోల్ పంపుల వ‌ద్ద ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామ‌ని ఐవోసీ రిటైల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అజ‌య్ కుమార్ శ్రీవాత్సవ్ చెప్పారు. వాటిలో మ‌ర‌ట్వాడా రీజియ‌న్‌లో ఐదింటిని ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఔరంగాబాద్‌లో శుక్రవారం జ‌రిగిన ఓ కార్యక్రమంలో అజ‌య్ కుమార్ శ్రీవాత్సవ్ పాల్గొన్నారు. ఆజాదీ కా అమ్రుత్ మ‌హోత్సవ్ ఇన్షియేటివ్‌లో భాగంగా ఔరంగాబాద్ ఐవోసీ పెట్రోల్ పంపులో పెట్రోల్‌, డీజిల్ అమ్మకాలతోపాటు విద్యుత్ చార్జింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఇండియ‌న్ ఆయిల్ మ‌హ‌రాష్ట్ర హెడ్ అనిర్బన్ ఘోష్.. ఈ చార్జింగ్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. అవసరానికి అనుగుణంగా రాష్ట్రంలోని 100 ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ చార్జింగ్ స్టేష‌న్ల కెపాసిటీని 15 కిలోవాట్ల నుంచి 45 కిలోవాట్లకు అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు.

Also Read: FAKE CHALLAN SCAM: ఏపీలో సరికొత్త నకిలీ వైరస్.. ఇది సోకితే.. రాష్ట్ర ఖజానా శంకరగిరి మాన్యాలేనట.. ఫోకస్ పెట్టిన సీఎం జగన్

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం రేట్లు.. ప్రధాన నగరాల్లో..

ICICI HFC: ఐటీ రిటర్న్స్ పత్రాలు లేవా? మరేం పర్వాలేదు.. గృహ రుణాల కోసం ఐసిఐసిఐ బంపర్ ఆఫర్.. పూర్తి వివరాలు మీకోసం..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం