Hairy Ears: పురుషుల చెవిపై వచ్చే వెంట్రుకలు వల్ల ఏదైనా ప్రమాదాలు ఏర్పడతాయా..
Ear hair: వయసుతో పాటు.. కొంతమంది పురుషులకు గుండెలపైన, చెవుల మీద జుట్టు రావడం సర్వసాధారణం. నిజానికి మనిషి శరీరంలో అరచేతులు, అరికాళ్ళు, పెదవులు తప్ప.. మిగతా శరీరంలో అన్ని భాగాలపై వెంట్రుకలు..
Hairy Ears: వయసుతో పాటు.. కొంతమంది పురుషులకు గుండెలపైన, చెవుల మీద జుట్టు రావడం సర్వసాధారణం. నిజానికి మనిషి శరీరంలో అరచేతులు, అరికాళ్ళు, పెదవులు తప్ప.. మిగతా శరీరంలో అన్ని భాగాలపై వెంట్రుకలు ఉంటాయి. అప్పుడే పుట్టిన శిశువు శరీరంపై చెవులతో సహా మృదువైన జుట్టు ఉంటుంది. దీనిని లానుగో అని అంటారు. శిశువుగా ఉన్న సమయంలో జుట్టు పోవడానికి మన పెద్దలు నలుగు పెట్టేవారు. అలా నలుగు పెట్టగా పెట్టగా జుట్టు పోతుంది. అయితే కొంత మంది పురుషులకు వృద్ధాప్యపు ఛాయలు వచ్చే కొద్దీ చెవుల్లో జుట్టు వస్తుంది. దీనికి కారణం మగ వారిలో పెరిగే టెస్టోస్టెరాన్ వల్ల కావచ్చునని వైద్యులు భావిస్తున్నారు. ఈ హార్మోన్ బూడిద రంగులో జుట్టును ముతకగా, మందంగా చేస్తుంది.
అయితే చెవులపై వెంట్రుకలు రావడం వల్ల ఎటువంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలగవు. అంతేకాదు చెవిలో ఉన్న జుట్టు వలన కూడా ప్రయోజనాలున్నాయి. చెవి లోపల ఉన్న జుట్టు చెవిపోటు నుండి ధూళి వంటి వాటి నుంచి దూరంగా ఉంచడానికి ఐయర్ వాక్స్ తో కలిసి పని చేస్తుంది.
ఇలా ఎక్కువగా చెవుల్లో జుట్టు ఎక్కువగా భారత్, శ్రీలంక పురుషుల్లోనే సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీనిని కారణం హైపర్ట్రిసిస్ అని పిలవబడే ఒక పరిస్థితి కారణం అని అంటున్నారు. దీని వల్ల శరీరమంతా జట్టు పెరుగుతుంది. కొన్ని సందర్భాలు జన్యుపరమైనవిగా పేర్కొంటుంటారు.
చెవులపై వెంట్రుకలు వచ్చినవారు అవి నచ్చకపోతే వాటిని తొలగించుకోవచ్చు. దీంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తవు. షేవింగ్, ప్లకింగ్, వాక్సింగ్, హెయిర్ రిమూవర్ క్రిములు ఉపయోగించి లేదా లేజర్ ట్రీట్మెంట్ వల్ల వెంట్రుకలను తొలగించుకోవచ్చు.
Also Read: Electric Scooter: స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్.. ప్రీ బుకింగ్ ఎలా అంటే