Electric Scooter: స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్.. ప్రీ బుకింగ్ ఎలా అంటే

Simple One Electric Scooter: పెట్రోల్ ధరలకు చెక్ పెట్టడమే కాదు.. వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించే వాహనాలపై తయారీదారులు దృష్టి పెట్టారు. ఇక వినియోగదారులను కూడా ఈ వాహనాలు ఆకర్షిస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు..

Electric Scooter: స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్.. ప్రీ బుకింగ్ ఎలా అంటే
Electric Sctoor
Follow us
Surya Kala

|

Updated on: Aug 14, 2021 | 10:18 AM

Simple One Electric Scooter: పెట్రోల్ ధరలకు చెక్ పెట్టడమే కాదు.. వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించే వాహనాలపై తయారీదారులు దృష్టి పెట్టారు. ఇక వినియోగదారులను కూడా ఈ వాహనాలు ఆకర్షిస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ తన మొదటి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను స్వాతంత్ర దినోత్సవ కానుకగా లాంఛ్ చేయడానికి రెడీ అయ్యింది. ఆగస్టు 15న ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిలీజ్ చేయనున్నామని ప్రకటించింది.

ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వినియోగదారులు కంపెనీ వెబ్ సైట్లో రేపు సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఇందుకు గాను రూ. 1,947 చెల్లించాల్సి ఉంది. తమ ఎలక్రికల్ వెహికల్స్ ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ సృష్టించాలని తాము కోరుకుంటున్నామని యాజమాన్యం తెలిపింది. ఆగస్టు 15 మాకు చారిత్రాత్మక రోజు అని కంపెనీ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుహాస్ రాజ్ కుమార్ చెప్పారు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే టచ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆన్ బోర్డ్ నావిగేషన్ సపోర్ట్ ఉన్నాయి. సింగిల్ చార్జ్ చేస్తే 240 కి.మీ మైలేజ్ ఇస్తుంది. సింపుల్ వన్ ధర రూ. 1,00,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. సింపుల్ వన్ మొదటి దశలో 13 రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు. సింపుల్ వన్ లాంఛ్ తర్వాత తన ప్రత్యర్థులైన ఓలా స్కూటర్, అథర్ 450ఎక్స్ తో తలపడనుంది.

Also Read: Drumstick Leaves Soup: రోగనిరోధక శక్తిని పెంచే మునగాకు సూప్ తయారీ విధానం ఎలా అంటే..