AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC‌ News: ఎల్‌ఐసీలో ఐదేళ్ల గరిష్ఠ స్థాయిలో డెత్ క్లైమ్స్.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణమా? ఎన్ని క్లైమ్స్ వచ్చాయంటే..

LIC News: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో భారత జీవిత బీమా సంస్థ (LIC)కి డెత్ క్లైమ్స్ భారీగా పెరిగాయి. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020-21 సంవత్సరంలో డెత్ క్లైమ్స్ ఏకంగా 17 శాతం ఎక్కువగా వచ్చినట్లు ఎల్ఐసీ తెలిపింది.

LIC‌ News: ఎల్‌ఐసీలో ఐదేళ్ల గరిష్ఠ స్థాయిలో డెత్ క్లైమ్స్.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణమా? ఎన్ని క్లైమ్స్ వచ్చాయంటే..
LIC
Janardhan Veluru
|

Updated on: Aug 14, 2021 | 2:50 PM

Share

కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత జీవిత బీమా సంస్థ (LIC)కి డెత్ క్లైమ్స్ భారీగా పెరిగాయి. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020-21 సంవత్సరంలో డెత్ క్లైమ్స్ ఏకంగా 17 శాతం పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సంఖ్య గత ఐదేళ్ల కాలంలోనే గరిష్ఠ స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీకి 9.75 లక్షల డెత్ క్లైమ్స్ రాగా..2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11.47 లక్షల డెత్ క్లైమ్స్ వచ్చాయని తెలిపింది. మునుపటి సంవత్సరపు క్లైమ్స్‌ను కూడా కలుపుకుని మొత్తం 11.42 డెత్ క్లైమ్స్‌ను సెటిల్ చేసినట్లు వెల్లడించింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.24,195.01 కోట్ల డెత్ క్లైమ్స్ పాలసీదారుల నామినీలకు చెల్లించినట్లు వివరించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో డెత్ క్లైమ్స్ కింద ఎల్ఐసీ రూ.17.419.57 కోట్లు చెల్లించింది. కాగా ఆ సంవత్సరంలో 9.32 లక్షల క్లైమ్స్‌ను ఎల్ఐసీ సెటిల్ చేసింది.

2020 జూన్ 30తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసంలో డెత్ క్లైమ్స్ అత్యధికంగా వచ్చాయి. ఆ సమయంలో సెకండ్ వేవ్ కారణంగా దేశంలో భారీ సంఖ్యలో మరణాలు సంభవించడం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగానే ఎల్‌ఐసీకి డెత్ క్లైమ్స్ మునుపెన్నడూ లేని స్థాయిలో పెరిగినట్లు తెలుస్తోంది. అయితే పాలసీదారులు ఏ కారణాలతో అత్యధికంగా మరణించారు? డెత్ క్లైమ్స్ పెరగడానికి కారణాలు ఏంటో? ఎల్ఐసీ వెల్లడించలేదు. అటు ప్రైవేటు బీమా సంస్థలు సైతం 2020-21 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసంలో డెత్ క్లైమ్స్ దాదాపు రెండింతలు పెరిగినట్లు వెల్లడించాయి.

Also Read..

థర్డ్‌ వేవ్ ప్రభావమేనా..? పిల్లలపై కరోనా పంజా.. ఆ నగరంలోని తల్లిదండ్రుల్లో ఆందోళన

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే