Medicinal Plant: మనచుట్టూ పెరిగే ఈ చిన్న మొక్క ఔషధాల గని.. అనేక అనారోగ్య సమస్యల నివారణకు దివ్య ఔషధం
Nela Usiri Benefits: ప్రకృతికి మనిషికి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అందుకనే ప్రకృతిలోని ప్రతి మొక్క అనేక ప్రయోజనాలను ఇస్తాయి. ఔషధగుణాలు కలిగి ఉన్నాయి. ప్రకృతిలో తొంబై తొమ్మిది శాతం వరకూ పనికిరానిది..
Nela Usiri Benefits: ప్రకృతికి మనిషికి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అందుకనే ప్రకృతిలోని ప్రతి మొక్క అనేక ప్రయోజనాలను ఇస్తాయి. ఔషధగుణాలు కలిగి ఉన్నాయి. ప్రకృతిలో తొంబై తొమ్మిది శాతం వరకూ పనికిరానిది ఉందని.. వినియోగించుకోవడంలోనే మనం నిర్లక్ష్యం చేస్తున్నామన్నది అక్షర సత్యం. మన చుట్టూ పెరిగే చిన్న మొక్కల్ని పీకి పారేస్తూవుంటాం. అలాంటి కోవకి చెందినదే నేల ఉసిరి. ఈ మొక్క అనేక రుగ్మతలకి, వ్యాధులకీ వైద్య విధానంలో ఉపయోగపడుతోంది. నేల ఉసిరి కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, ఈ చెట్టునుండి ఏర్పడే పాలు అన్నీ ఆయుర్వేద మందుల్లో వాడతారు.
*నేల ఉసిరిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వంటి అనేక ఔషధ లక్షణాలున్నాయి. నేల ఉసిరిని జ్యుస్ గా తీసుకోవడం వలన పొత్తి కడుపులో మంటను తగ్గిస్తుంది. అంతేకాదు ల్యూకోరోయా, బాధాకరమైన మూత్రవిసర్జనను , మూత్ర ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. దీనిని శరీరంలో దురద, గాయాలు, గజ్జి, రింగ్వార్మ్స్ చికిత్సలో కూడా ఉపయోగిస్తున్నారు. *ఇది కాలేయం నుండి పిత్త ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఎసిడిటీ, ఆమ్లత్వం నుండి ఉపశమనం పొందడానికి మంచి ఔషధం. మలబద్ధకం తగ్గిస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. *నేల ఉసిరి జ్యూస్ కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర కిడ్నీ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. *కామెర్లు, హెపటైటిస్ మరియు కాలేయ ఆరోగ్యానికి నేల ఉసిరి దివ్య ఔషధం. *కాలేయం సమస్యలు వల్ల ఏర్పడే కంటి సమస్యలకు చికిత్స చేయడానికి నేల ఉసిరి రసం మంచిది. ఈ రసాన్ని ఉదయం ఒకసారి ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో సేవిస్తే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. *మధుమేహానికి ఈ జ్యూస్ చాలా మంచిది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, నేల ఉసిరి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. *దీని చేదు, మూత్రవిసర్జన, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటానికి , డయాబెటిక్ పరిస్థితుల నుండి ఉపశమనం అందించడానికి సహాయపడతాయి.
Also Read: శ్రావణ శోభను సంతరించుకున్న ఆలయాలు.. పుట్టలో పాలు పోస్తున్న భక్తులు…నాగ పంచమి విశిష్టత ఏమిటంటే