AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makhana: బరువు తగ్గి, స్లిమ్‌గా అవ్వాలనుకునేవారికి బెస్ట్‌అప్షన్ ‘మఖాన’.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదలురుగా

Makhana For Weight Loss: అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారపదార్ధాల్లో ఒకటి పూల్ మఖనా. నిజానికి ఇవి తామర గింజలు.. అయితే పూల్ మఖనాగా ఫేమస్ అయ్యాయి. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది..

Makhana: బరువు తగ్గి, స్లిమ్‌గా అవ్వాలనుకునేవారికి బెస్ట్‌అప్షన్ 'మఖాన'.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదలురుగా
Makhana
Surya Kala
|

Updated on: Aug 13, 2021 | 9:24 AM

Share

Makhana For Weight Loss: అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారపదార్ధాల్లో ఒకటి పూల్ మఖనా. నిజానికి ఇవి తామర గింజలు.. అయితే పూల్ మఖనాగా ఫేమస్ అయ్యాయి. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇక ఎముకలకు మంచి పోషకం ఇచ్చే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం, భాస్వరంలతో పాటు తక్కువ పరిమాణంలో కొన్ని విటమిన్లు కూడా మఖానాలో ఉన్నాయి. అందుకనే బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ అప్షన్ మఖాన అని చెప్పవచ్చు.

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున వీటిలో గొప్ప యాంటీ ఏజింగ్ ప్రభావం ఉంటుంది. ఇది యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మం నిగారింపును, ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. వీరిని తరచుగా ఆహారంగా తీసుకుంటే సులువుగా బరువు తగ్గడంతో పాటు అందం కూడా మీ సొంతం అవుతుంది..

మఖాన అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. బరువు తగ్గడానికి ఆరోగ్యంగా ఉండటానికి తీసుకుని కెలోరీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే మఖాన తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండడంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. అంటే అవి రక్తంలో గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండేందుకు కూడా దోహదపడుతుంది.

ఒక కప్పు మఖాన లో 106 కెలోరీలు ఉంటాయి. ఇందులో కెలోరీలు తక్కువగా ఉండటంతో బెస్ట్ స్నాక్స్ గా దీన్ని తీసుకోవచ్చు. ఇవి తినడం వల్ల పొట్ట నిండుగా ఫీలింగ్ కలుగుతుంది. దీనిలో సాచురేటెడ్ కొవ్వు ఉండటం వల్ల అవి శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి. ఇవి తక్కువ గ్లైసెమిక్ ఆహారం కావడంతో మీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహయపడతాయి.

తామర గింజల్లో యాంటీ బయటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి కనుక పైన చెప్పుకున్న ఫలితాలతో పాటు రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. కనుక పూల్ మఖానను రెగ్యులర్ గా ఆహారంలో భాగంగా తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.

Also Read:  పారా ఒలింపిక్స్ కోసం టోక్యో చేరుకున్న భారత జట్టు.. బెస్ట్ విశేష్ చెప్పిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్

కిడ్నీలో రాళ్ల నివారణ కోసం ఈ వంటింటి చిట్కాలను పాటించండి ఉపశమనం పొందండి