Tokyo Paralympics 2020: పారా ఒలింపిక్స్ కోసం టోక్యో చేరుకున్న భారత జట్టు.. బెస్ట్ విశేష్ చెప్పిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్

Tokyo Paralympics 2020: టోక్యో ఒలింపిక్స్ 2020 జర్నీని నీరజ్‌ చోప్రా అథ్లెటిక్స్‌ స్వర్ణంతో ముగించి భారత్ కు చిరస్మరణీయమైన జ్ఞాపకాలను ఇచ్చింది. అయితే అదే వేదికపై మళ్ళీ పతకాల వేటకు భారత్ పయనమైంది. పారా ఒలింపిక్స్ లో..

Tokyo Paralympics 2020: పారా ఒలింపిక్స్ కోసం టోక్యో చేరుకున్న భారత జట్టు.. బెస్ట్ విశేష్ చెప్పిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్
Tokyo Paralympics
Follow us
Surya Kala

|

Updated on: Aug 13, 2021 | 8:58 AM

Tokyo Paralympics 2020: టోక్యో ఒలింపిక్స్ 2020 జర్నీని నీరజ్‌ చోప్రా అథ్లెటిక్స్‌ స్వర్ణంతో ముగించి భారత్ కు చిరస్మరణీయమైన జ్ఞాపకాలను ఇచ్చింది. అయితే అదే వేదికపై మళ్ళీ పతకాల వేటకు భారత్ పయనమైంది. పారా ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు 54మంది సభ్యులతో కూడిన భారత్ బృందం గురువారం బయలుదేరింది.

జపాన్ రాజధాని టోక్యో లో ఈ నెల 24నుంచి దివ్యాంగ విశ్వక్రీడలు జరుగనున్నాయి. అయితే 27నుంచి జరగనున్న ఈవెంట్స్ లో భారత క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో భారత్ నుంచి ఫేవరేట్ క్రీడాకారులుగా పారాలింపిక్‌ చాంపియన్లు దేవేంద్ర జఝారియా (ఎఫ్‌–46 జావెలిన్‌ త్రో), మరియప్పన్‌ తంగవేలు (టి–63 హైజంప్‌), ప్రపంచ చాంపియన్‌ సందీప్‌ చౌదరి (ఎఫ్‌–64 జావెలిన్‌ త్రో) బరిలోకి దిగనున్నారు.

ఇప్పటికే ఏథెన్స్‌(2004), రియో (2016) పారాలింపిక్స్‌లో పసిడి పతకాలను గెలుచుకున్న దేవేంద్ర మూడో సారి గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటున్నారు. గత పారాలింపిక్స్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శనతో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం గెలుపొందింది.

పారా ఒలింపిక్స్ లో భారత జట్టు దిగ్విజయంగా పతకాలతో తిరిగి రావాలని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్, భారత పారాలింపిక్‌ సంఘం అధికారులు శుభాకాంక్షలు చెప్పారు. క్రీడాకారులను టోక్యోకి పంపిస్తూ.. మన క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి పతకాలను తీసుకుని రావాలని కోరుకున్నారు.

Also Read:  నాగ పంచమి రోజున ఎలా పూజ చేయాలి… పుట్టలో పాలు పోస్తే కలిగే శుభ ఫలితాలు ఏమిటంటే