Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్‌కు సిద్ధమైన టోక్యో.. 24 నుంచి ప్రారంభం.. 54 మందితో బయల్దేరిన భారత బృందం

పారా ఒలింపిక్స్ ఈ నెల 24 నుంచి మొదలుకానున్నాయి. 16వ సమ్మర్ పారా ఒలింపిక్స్ సెప్టెంబర్ 5 వరకు జరగనున్నాయి.

Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్‌కు సిద్ధమైన టోక్యో.. 24 నుంచి ప్రారంభం.. 54 మందితో బయల్దేరిన భారత బృందం
Tokyo Paralympics 2021
Follow us
Venkata Chari

|

Updated on: Aug 12, 2021 | 9:38 PM

Tokyo Paralympics 2021: టోక్యో ఒలింపిక్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు మరో క్రీడా సంబరం మొదలు కానుంది. పారా ఒలింపిక్స్ ఈ నెల 24 నుంచి మొదలుకానున్నాయి. 16వ సమ్మర్ పారా ఒలింపిక్స్ సెప్టెంబర్ 5 వరకు జరగనున్నాయి. ఈమేరకు టోక్యో పారా ఒలింపిక్స్‌కు భారత బృందం బయలుదేరింది. 54 మంది సభ్యలతో టోక్యోకు వెళ్లింది. ఈమేరకు ఆటగాళ్లకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆల్ ది బెస్ట్ చెబుతూ వీడ్కోలు పలికారు. పారా ఒలింపిక్స్‌లో 9 క్రీడాంశాల్లో భారత ఆటగాళ్లు సత్తా చూపనున్నారు. కాగా, ఈనెల 27న ఆర్చరీతో భారత అథ్లెట్ల మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.

ఈ ఏడాది మొత్తం 22 క్రీడాంశాల్లో 540 ఈవెంట్లు జరగనున్నాయి. మొత్తం 4,400 మంది అథ్లెట్లు 16వ సమ్మర్ పారా ఒలింపిక్స్‌లో భాగస్వామ్యం కానున్నారు.

కాగా రియో పారా ఒలింపిక్స్ 2016లో చైనా 105 స్వర్ణాలు, 81 రజతాలు, 51 కాంస్యాలతో 237 పతకాలు సాధించి తొలిస్థానంలో నిలిచింది. బ్రిటన్‌ 64, ఉక్రెయిన్‌ 41, అమెరికా 40 స్వర్ణాలు సాధించాయి. బ్రెజిల్‌ 14 బంగారం పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. భారత్‌ మాత్రం కేవలం రెండు స్వర్ణాలు, ఒక రజతం, కాంస్యం సాధించి 42వ స్థానంలో సాధించింది.

Also Read: Neeraj Chopra: వరల్డ్ జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌ విడుదల.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ చేరుకున్న నీరజ్ చోప్రా.. ఎంతంటే?

MS Dhoni Meets Vijay: మాస్టర్‌తో మిస్టర్ కూల్.. దళపతికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ధోని.. నెట్టింట్లో ఫ్యాన్స్ సందడి

Viral Video: గోల్ చేసేందుకు పరుగులు తీస్తున్న ఫుట్‌బాలర్స్.. హఠాత్తుగా గ్రౌండ్‌లోకి బాలుడి ఎంట్రీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే?