Viral Video: గోల్ చేసేందుకు పరుగులు తీస్తున్న ఫుట్‌బాలర్స్.. హఠాత్తుగా గ్రౌండ్‌లోకి బాలుడి ఎంట్రీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

హోరాహోరీగా సాగుతున్న ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లోకి హఠాత్తుగా ఓ పిల్లాడు ఎంట్రీ ఇచ్చాడు. ఊహించని ఈ పరిణామంతో ఆ పిల్లాడి తల్లితోపాటు జనాలు షాకయ్యారు.

Viral Video: గోల్ చేసేందుకు పరుగులు తీస్తున్న ఫుట్‌బాలర్స్.. హఠాత్తుగా గ్రౌండ్‌లోకి బాలుడి ఎంట్రీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే?
Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Aug 12, 2021 | 6:18 PM

Viral Video: నెట్టిట్లో వైరల్ వీడియోలు తెగ సందడి చేస్తుంటాయి. ఏ చిన్న విషయం జరిగినా షూట్ చేసి నెట్టింట్లో పెడుతుంటారు. అదికాస్త నెటిజన్లకు నచ్చితే తెగ వైరల్ చేస్తుంటారు. తాజాగా హోరాహోరీగా సాగుతున్న ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లోకి హఠాత్తుగా ఓ పిల్లాడు ఎంట్రీ ఇచ్చాడు. ఊహించని ఈ పరిణామంతో ఆ పిల్లాడి తల్లితోపాటు జనాలు షాకయ్యారు. ఈ తతంగాన్ని వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటూ దూసుకపోతోంది.

అసలు విషయానికి వెళ్తే.. యూఎస్‌లో ఒహియోకు చెందిన 2 ఏళ్ల బాలుడు జైడెక్ కార్పెంటర్, అతని తల్లి మోర్గాన్ టక్కర్‌‌తో కలిసి మ్యాచ్ చూసేందుకు వచ్చారు. ఎఫ్‌సీ సిన్సినాటి వర్సెస్ ఓర్లాండో సిటీ ఎసీ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే మ్యాచ్ రెండవ భాగంలో చాలా హోరాహోరీగా సాగుతోంది. మ్యాచ్‌ను ఆసక్తిగా చూస్తోన్న ఆమె పిల్లాడిని పట్టించుకోలేదు. దీంతో ఆ పిల్లాడు గేటు దాటుకుని మైదానంలోకి అడుగుపెట్టాడు. వెంటనే గమనించిన ఆమె ఆ పిల్లాడి వెనుక మైదానంలోకి పరుగెత్తింది. పిల్లాడిని పట్టుకోబోయింది. కానీ, మైదానంలో ఆమె కాలు జారి కిందపడిపోయింది. వెంటనే లేచి పిల్లాడిని పట్టుకుని మైదానం బయటకు వచ్చేసింది.

ఈ వీడియోను మేజర్ లీగ్ సాకర్ ట్విట్టర్లో పంచుకుంది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అలాగే పిల్లాడిని పట్టుకుని మైదాన బయటకు వస్తున్న ఆమె ఫొటోను సామ్ గ్రీన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పంచుకున్నాడు. ఈ ఫొటో కూడా వైరల్‌గా మారింది. ‘ఓ పిల్లాడు తన వ్యక్తిగత సెక్యూరిటీని దాటుకుని మైదానంలోకి ప్రవేశించాడు’ అంటూ రాసుకొచ్చాడు. 26 సెకండ్ల ఈ క్లిప్ 3వేలకు పైగా లైక్స్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది.

Also Read: బర్త్ డే పార్టీలో చిన్న పాటి సినిమా చూపించిన రౌడీ షీటర్.. కారెక్కి తుపాకీతో గాల్లోకి కాల్పులు.. వీడియో వైరల్

Viral Video: జిరాఫీని మట్టుబెట్టి వేటాడిన సింహం.. మృగరాజు వేట చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

షూటింగ్స్ లో డేంజర్ బెల్స్.. స్టన్నింగ్‌ స్టంట్‌ చేసేప్పుడు సీన్ రివర్స్ అయితే…?:Danger Bells In Shooting Live video.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!