Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో… పాము నోట్లోకి వెళ్లి కూడా బ్రతికొచ్చిన పక్షి..

అడవిలో ఉండే జంతువుల ఫోకస్ ఎల్లప్పుడూ ఆహారంపైనే ఉంటుంది. తాము ఆహారం తినడం, పిల్లలకు తెచ్చిపెట్టడం ఎల్లప్పుడూ వాటికి ఇదే పని ఉంటుంది.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో... పాము నోట్లోకి వెళ్లి కూడా బ్రతికొచ్చిన పక్షి..
Snake Attack
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 12, 2021 | 7:45 PM

అడవిలో ఉండే జంతువుల ఫోకస్ ఎల్లప్పుడూ ఆహారంపైనే ఉంటుంది. తాము ఆహారం తినడం, పిల్లలకు తెచ్చిపెట్టడం ఎల్లప్పుడూ వాటికి ఇదే పని ఉంటుంది. ఇక సింహం, పెద్ద పులి, చిరుత వంటి జంతువులు వేటాడేందుకు రెండు పద్దతులను ఎంచుకుంటాయి. ఒకటి నక్కి వేటాడటం, రెండు ఎదురుగా వెళ్లి మీద పడటం. పాములు కూడా ఇంచుమించు ఇదే మార్గాన్ని ఫాలో అవుతాయి. కుదిరినంతలో దొంగతనంగా మాటు వేసి.. ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. లేని పరిస్థితుల్లో వేటకు బయటదేరుతాయి. ఇక సోషల్ మీడియాలో రోజు జంతువులు, పక్షులు, క్షీరదాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని షాక్‌కు గురిచేస్తాయి. తాజాగా ఒక పాము వేట కోసం మాటు వేసి ఉన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ముందుగా వీడియో వీక్షించండి…

ఒక పక్షి కొండ యొక్క రంధ్రంలో సేద తీరడానికి వెళ్తుంది. అయితే అప్పటికే ఒక్కడ ఒక పాము మాటు వేసింది. అంతేకాదు.. ఆ పాము ఆ కొండ రంగులో కలిసిపోయింది. ముందుగా అయితే అక్కడ పాము ఉన్నట్లు ఎవరూ గమనించలేరు. ఆ పక్షి కూడా అక్కడ ఎవరూ లేరనే అక్కడికి వెళ్లబోయింది. ఇంతలో పాము నోరు తెరిచి ఒక్కసారిగా పక్షిపై దాడి చేసింది. ఇంచుమించు పక్షిని పాము పట్టేసింది. అయితే చివరి నిమిషంలో చాకచాక్యంగా వ్యవహరించిన పక్షి.. పాము నోట్లోకి వెళ్లి కూడా సజీవంగా బయటకు వచ్చింది. ఈ వీడియో చూసినవారు పక్షి సమయస్పూర్తి చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఆయుష్ స్పీక్ అనే ఖాతా నుంచి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ హారిబుల్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. నెటిజన్లు వీడియోను షేర్స్ చేయడంతో పాటు తమ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. వీడియో చూసినప్పుడు, మీకు కూడా గూస్‌బంప్స్ వచ్చాయి కదూ..!

Also Read: ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క లిక్కర్ బాటిల్ తెచ్చేందుకు కూడా అనుమతి లేదు.. ఏపీ సర్కార్ క్లారిటీ

ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్‌పై ట్విస్ట్… హైకోర్టుకు వెళ్లిన వ్యవహారం