AP Schools Re-open: ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్‌పై ట్విస్ట్… హైకోర్టుకు వెళ్లిన వ్యవహారం

పిల్లలు క్లాస్ రూమ్ మరచిపోయి 500 రోజులు దాటింది. భుజాన బ్యాగేసుకుని స్కూల్‌కి ఎప్పుడు వెళ్తారో తెలియని అయోమయ పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో..

AP Schools Re-open: ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్‌పై ట్విస్ట్... హైకోర్టుకు వెళ్లిన వ్యవహారం
Andhra Schools
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 12, 2021 | 5:07 PM

పిల్లలు క్లాస్ రూమ్ మరచిపోయి 500 రోజులు దాటింది. భుజాన బ్యాగేసుకుని స్కూల్‌కి ఎప్పుడు వెళ్తారో తెలియని అయోమయ పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ తెరిచినప్పటికీ విద్యార్థులు కరోనా బారిన పడడంతో మిగతా రాష్ట్రాలు ఆలోచనలో పడుతున్నాయి. అసలే కరోనా థర్డ్ వేవ్ అంచనాలు.. ఈ క్రమంలో స్కూల్ గేట్లు ఓపెన్ అవుతాయా అన్నది అనుమానంగా కనిపిస్తోంది. విద్యా సంస్థలు తెరవడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చినప్పటికీ విద్యాశాఖ వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. అయితే ఏపీ మాత్రం ఈనెల 16 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు కొంతమంది పేరెంట్స్‌ కూడా జాగ్రత్తల మధ్య పాఠశాలలను తెరవడమే మంచిదంటున్నారు. నైన్త్‌, టెన్త్‌ క్లాస్‌లకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించి.. మిగిలిన వారికి ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలంటున్నారు.  ఈ క్రమంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకనే స్కూల్స్ తెరవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. టీచర్లకు వ్యాక్సినేషన్ ఇంకా పూర్తి కాలేదని కాలేదని  పిటిషనర్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కాకుండా పాఠశాలలు ఎలా తెరుస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. కాగా ఉపాధ్యాయులకు 85% వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మిగతా వారికి కూడా త్వరితగతిన వ్యాక్సినేషన్  పూర్తి చేస్తామని చెప్పారు. అంతేకాదు ఆఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో కేసు విచారణను ఈ నెల 18కి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.

మద్దతిస్తున్నవారూ ఉన్నారు.. వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు

మాల్స్‌కి, థియేటర్స్‌కి అనుమతి ఇచ్చినప్పుడు విద్యా సంస్థల్ని తెరిస్తే తప్పేంటన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేతల యాత్రలు, భారీ సభలు, సమావేశాలు ఎలాంటి అడ్డంకుల్లేకుండా కొనసాగుతున్నాయి. వాటికి లేని నిబంధనలు స్కూళ్లకి ఏంటన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఏడాదిన్నరగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లకపోవడంతో విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని… ఇది విద్యార్థుల భవితవ్యాన్ని దెబ్బతీస్తుందంటున్నారు కొందరు. ఒకవేళ తెరిస్తే విద్యార్థుల ప్రాణాలు రక్షణ ఏదీ అని ప్రశ్నిస్తున్నారు మరికొందరు. మొత్తం మీద స్కూల్స్ రీ-ఓపెన్‌పై  ద్వంద వాదనలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి.

Also Read:తెల్లనివన్నీ పాలు కాదు.. తస్మాత్ జాగ్రత్త.. కల్తీవీ తాగితే తట్టెడన్ని రోగాలు

హైదరాబాదీలు బీ అలెర్ట్… కాలకూట విషంగా మారిన భాగ్యనగరం మట్టి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే