- Telugu News Photo Gallery nag panchami 2021: worship on nag panchami till this time 13 august nag devta protect your house
Nag Panchami 2021: నాగ పంచమి రోజున ఎలా పూజ చేయాలి… పుట్టలో పాలు పోస్తే కలిగే శుభ ఫలితాలు ఏమిటంటే
Naga Panchami: శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజును ”నాగ పంచమి”గాను ”గరుడ పంచమి”గా పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో ”నాగపూజ” కి ఒక గొప్ప విశిష్టత ఉంది. శ్రావణ శుద్ధ పంచమి నాడు చేసే ‘నాగ పంచమి’ అత్యంత విశిష్టతను సంతరించుకుందని ఈ పర్వదిన ప్రాముఖ్యతని సాక్షాత్ పరమశివుడే స్కంద పురాణములో వివరించాడు. నాగుల చవితి మాదిరిగానే నాగ పంచమి రోజున కూడా నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు.
Updated on: Aug 13, 2021 | 8:32 AM

నాగపంచమి జరుపుకోవడానికి పురాణాల కథనం ప్రకారం ఆదిశేషుని సేవకు మెచ్చిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు ఆనందంతో ”తాము ఉద్భ వించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని” ఆదిశేషుడు వరం కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికని మన్నించి మహావిష్ణువు ఈ నాగుల పంచమి రోజు సర్ప పూజలు అందరూ చేస్తారని వరం ఇచ్చాడు.

నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుందని భక్తుల నమ్మకం

సాక్షాత్తు పరమేశ్వరుడే "నాగపంచమి" రోజున భక్తులు ఆచరించాల్సిన పూజావిధానాన్ని పార్వతీ దేవికి వివరించినట్లుగా స్కాందపురాణం చెబుతోంది. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం.

నాగ పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతం, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, పాయసం నివేదించాలని ముక్కంటి.. శక్తిమాతకు వివరించినట్లు తెలుస్తోంది.

నాగపంచమి నాడు పాము పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెప్పారు. అంతేకాదు నాగదేవి కొలువైన దేవాలయంలో నాగా అష్టోత్తరం, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.




