Nag Panchami: శ్రావణ శోభను సంతరించుకున్న ఆలయాలు.. పుట్టలో పాలు పోస్తున్న భక్తులు…నాగ పంచమి విశిష్టత ఏమిటంటే

Nag Panchami 2021: తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. ఈరోజు నాగపంచమి భక్తితో సర్పాలను పూజిస్తారు. పుట్టవద్దకు వెళ్లి పాలు పోసి పూలు పెట్టి భక్తులు పూజలను నిర్వహిస్తున్నారు. ఈ నాగపంచమి రోజున..

Nag Panchami: శ్రావణ శోభను సంతరించుకున్న ఆలయాలు.. పుట్టలో పాలు పోస్తున్న భక్తులు...నాగ పంచమి విశిష్టత ఏమిటంటే
Naga Panchami
Follow us

|

Updated on: Aug 13, 2021 | 9:54 AM

Nag Panchami 2021: తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. ఈరోజు నాగపంచమి భక్తితో సర్పాలను పూజిస్తారు. పుట్టవద్దకు వెళ్లి పాలు పోసి పూలు పెట్టి భక్తులు పూజలను నిర్వహిస్తున్నారు. ఈ నాగపంచమి రోజున సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్దలతో శ్రావణ శుక్ల 11వరోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లైతే సంతానభాగ్యం కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. నాగ పంచమి విశిష్టత, పూజా విధానం ఈరోజు నాగదేవతని పూజించడం వలన కలిగే ఫలితాలు గురించి తెలుసుకుందాం..

నాగ పంచమి విశిష్టత:

*పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది. సుగుణవతి, విద్యా వినయంగల సౌజన్యురాలు. పెద్దల పట్ల వినయ విదేయతలతోనూ పనివారి పట్ల కరుణ, దయ సానుభూతిగల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగుణ వతికి ఒక తీరని బాధ వుండేది. చెవిలో చీము కారుతుండేది. రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయడానికి ప్రయత్నిస్తుండేది.. దీంతో ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది. *ఎన్ని పూజలు చేసినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు. తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సాధువు వాళ్ళ ఊరుకు వచ్చాడు. ఆ సాధువు త్రికాలజ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిధి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గామేమిటని వినయపూర్వకముగా వేడుకుంది. *అందుకు ఆ సాధువు ఆలోచించి ఇది నీకు సర్పదోషంవల్ల సంభవించింది. ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్దని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం అని చెప్పారు సాధువు. *నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణా సముద్రుడు కనుక నువ్వు విశ్వాసంతో నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి. చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానం దాని నియమాలను గురించి సాధువు వివరించారు. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధానాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో నాగపంచమి నోము ఆచరించింది ఆ సుగుణవతి. ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళనలు తొలగి సంతోషముగా ఉంది.

ఉద్యాపన:

శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో ఉంది నాగేంద్రుడిని ఆరాధించాలి. నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పహ్ల పుష్పాదులు నారికేళం సమర్పించాలి. నాడు ఉపవాసం వుండాలి. నిరాహారం జాగరణ మరింత శ్రేయష్కరం.

పూజా విధానం:

నాగపంచమి రోజున సూర్యోదయమునకు ముందే ఐదు గంటలకే లేవాలి. శుచిగా తలస్నానము చేసి, ఎరుపురంగు బట్టలు ధరించాలి. పూజామందిరమును, ఇల్లును శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజామందిరము, ఇంటిముందు ముగ్గులు పెట్టాలి. పూజకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి, పాముపడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు (కనకాంబరాలు), మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్లు, వడపప్పు, అరటిపండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేగాకుండా రెండు ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకుని దూదితో 7 వత్తులలో నేతితో దీపమెలిగించాలి. నాగపంచమి రోజున ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి, పడమర దిక్కున తిరిగి పూజించాలి. ‘ఓం నాగరాజాయనమః’ అనే మంత్రమును 108 మార్లు జపించి, పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర హారతులిచ్చి, నైవేద్యం సమర్పించుకోవాలి. వీలైతే కర్పూర హారతులిచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరము, నాగ స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములలో ఏదైనా ఒక దానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్యపూజ, నాగదోష-పరిహారము వంటి పుస్తకములను తాంబూలము, పసుపు, కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్య ఫలం సిద్ధిస్తుంది.

Also Read:  నాగ పంచమి రోజున ఎలా పూజ చేయాలి… పుట్టలో పాలు పోస్తే కలిగే శుభ ఫలితాలు ఏమిటంటే