AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పొంచి ఉన్న డెంగ్యూ ప్రమాదం.. వీటిని తీసుకుంటే గట్టెక్కినట్లే.. ఎంటో తెలుసా..

వర్షకాలంలో ఫ్లూ, జ్వరం, జలుబు, దగ్గు వంటి రోగాలకు తోడు తాజాగా డెంగ్యూ వైరస్ వ్యాప్తి ఎక్కువైంది. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఎముకలలో భరించలేని నొప్పి కలుగుతుంది.

Health Tips: పొంచి ఉన్న డెంగ్యూ ప్రమాదం.. వీటిని తీసుకుంటే గట్టెక్కినట్లే.. ఎంటో తెలుసా..
Boost Immunity
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2021 | 11:39 AM

Share

వర్షకాలంలో ఫ్లూ, జ్వరం, జలుబు, దగ్గు వంటి రోగాలకు తోడు తాజాగా డెంగ్యూ వైరస్ వ్యాప్తి ఎక్కువైంది. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఎముకలలో భరించలేని నొప్పి కలుగుతుంది. జ్వరం, తలనొప్పి, చర్మంపై మశూచి లాంటి దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా డెంగ్యూ జ్వరం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అలాగే డెంగ్యూ నుంచి బయటపడేందుకు ఇంట్లోనే కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలి అవెంటే తెలుసుకుందామా.

విటమిన్ సి.. ఆహారంలో వీలైనంత వరకు విటమిన్ సి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ సి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని కూడా నిరోధిస్తుంది.

పసుపు వాడకం .. సాధారణంగా పసుపును కూరగాయలు లేదా పప్పులలో ఉపయోగిస్తాం. అలా కాకుండా.. పసుపు పాలను తీసుకోవడం వలన కూడా ఫలితం కనిపిస్తుంది. ఇందులో ఉండే యాంటీబయోటిక్ ఎలిమెంట్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వ్యాధుల నుండి రక్షిస్తాయి.

తులసి, తేనె.. తులసి, తేనెను తీసుకోవడం వలన డెంగ్యూని కూడా నివారించవచ్చు. తులసి ఆకులను నీటిలో మరిగించి అందులో తేనె కలిపి తాగవచ్చు. అలాగే కషాయంలో లేదా టీలో తులసిని ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

బొప్పాయి ఆకులు.. డెంగ్యూ చికిత్సలో బొప్పాయి ఆకులను మంచి నివారణగా పనిచేస్తాయి. బొప్పాయి ఆకుల రసాన్ని రోజుకు 2-3 స్పూన్ల చొప్పున తీసుకుంటే డెంగ్యూని నివారించవచ్చు. ఇది ఎర్ర రక్త కణాలను పెంచడమే కాకుండా, జీర్ణ శక్తిని మెరుగుపరిచే పాపైన్ అనే ప్రోటీన్ అధికంగా ఉండే ఎంజైమ్‌ను కలిగి ఉంటుంది.

దానిమ్మ .. డెంగ్యూ జ్వరం వలన శరీరంలో రక్తం లేకపోవడం, బలహీనతను అధిగమించడానికి, దానిమ్మ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ E, C, A, ఫోలిక్ యాసిడ్, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.

మెంతికూర.. డెంగ్యూని నివారించడంలో మెంతికూర ఆకులను తీసుకోవడం ఉపయోగపడుతుంది. హానికరమైన, విషపూరిత పదార్థాలన్నీ వాటి ఉపయోగం ద్వారా శరీరం నుండి బయటకు వస్తాయి. శారీరక నొప్పి, నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. దీనిని కూరగాయగా లేదా నీటిలో మరిగించి ఉపయోగించవచ్చు. ఇది కాకుండా మెంతి గింజలను కూడా ఉపయోగించవచ్చు.

మేక పాలు.. డెంగ్యూ జ్వరంకు మేక పాలు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మేక ముడి పాలను కొద్ది మొత్తంలో రోజుకు రెండు నుండి మూడు సార్లు తాగడం ప్రయోజనకరం. ఇది రక్తహీనతను తొలగిస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరం, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

సాధ్యమైనంత వరకు దోమలను నివారించడం డెంగ్యూని నివారించడానికి ప్రధాన మార్గం. దోమలను నివారించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో దోమలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డెంగ్యూ లేదా ఇతర సమస్యల లక్షణాలు ఉన్నట్లయితే, ఔషదాలు తీసుకునే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.

Also Read: Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..

Bigg Boss 5 telugu: నెట్టింట్లో ‘బిగ్‏బాస్’‏ షో హల్‏చల్.. మరోసారి కంటెస్టెంట్స్ లీస్ట్ లీక్.. వైరల్‏గా మారిన ఆట సందీప్ ట్వీట్..