AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిల్లలు కాదు చిచ్చర పిడుగులు.. ‘లోకల్ మేడ్ సూపర్ బైక్’పై ఎలా దూసుకెళ్తున్నారో చూడండి..

Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏది వైరల్‌గా మారుతుందో.. ఎప్పుడు ఏది లైమ్‌లైట్‌లోకి వస్తుందో ఎవరూ ఊహించలేరు. నెటిజన్లు నిత్యం.. అనేక వీడియోలను..

Viral Video: పిల్లలు కాదు చిచ్చర పిడుగులు.. ‘లోకల్ మేడ్ సూపర్ బైక్’పై ఎలా దూసుకెళ్తున్నారో చూడండి..
Viral Pics
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 16, 2021 | 6:27 AM

Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏది వైరల్‌గా మారుతుందో.. ఎప్పుడు ఏది లైమ్‌లైట్‌లోకి వస్తుందో ఎవరూ ఊహించలేరు. నెటిజన్లు నిత్యం.. అనేక వీడియోలను షేర్ చేస్తుంటారు. వాటిలో ఎన్నో ఫన్నీ వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆలరిస్తుంటాయి. కొన్ని వీడియోలను మళ్లీ మళ్లీ చూడాలానిపిస్తుంటుంది. ప్రత్యేకించి అద్భుతమైన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒక నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. గ్రామీణ ప్రాంత పిల్లలు.. ఊహించని రీతిలో సూపర్ బైక్‌ను తయారు చేసి.. దానిపై రయ్ మని దూసుకెళ్తున్నారు. ఆ వీడియోను చూస్తే మీరు కూడా షాక్ అవుతారు.

ఈ వీడియోలో కొందరు పిల్లలు.. చెక్కలను, బైక్ టైర్‌లను ఉపయోగించి సరికొత్త సూపర్ బైక్ తయారు చేశారు. ఆ బైక్‌పై పిల్లలు సంతోషంగా రయ్ మని దూసుకెళ్తున్నారు. గ్రామంలోని మట్టి రోడ్డుపై రేస్ పెట్టుకుని పోటీపడ్డారు. పిల్లల డ్రైవింగ్ చూస్తే ప్రొఫెసనల్స్ రేసర్స్‌ లా అనిపిస్తుంటుంది. పిల్లల రేస్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో ‘బిగ్ బుల్‌బైక్స్’ పేరుతో ఉన్న అకౌంట్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. పిల్లల టాలెంట్‌ చూసి వావ్ అంటున్నారు. వీరి యాక్షన్ ప్రొఫెషనల్ రేసర్స్ మాదిరిగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో అలరిస్తున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Shiny Teeth: మీ దంతాలు ముత్యాల్లా మెరవాలా? అయితే 6 టిప్స్‌ని ఫాలో అవ్వండి..

Gold Price Today: బంగారం ధర జిగేల్‌.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తాజా రేట్లు ఇలా ఉన్నాయి..!

Weight Loss: బరువు తగ్గాలా?.. నచ్చిన ఆహారం తింటూనే బరువు తగ్గొచ్చు.. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి..