Shiny Teeth: మీ దంతాలు ముత్యాల్లా మెరవాలా? అయితే 6 టిప్స్‌ని ఫాలో అవ్వండి..

Shiny Teeth: చిరునవ్వు.. మనిషి ముఖారవిందాన్ని మరింత పెంచుతుంది. ఆ చిరునవ్వే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తుంటుంది. అయితే, ఆ చిరునవ్వు..

Shiny Teeth: మీ దంతాలు ముత్యాల్లా మెరవాలా? అయితే 6 టిప్స్‌ని ఫాలో అవ్వండి..
Whitetooth
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 16, 2021 | 6:24 AM

Shiny Teeth: చిరునవ్వు.. మనిషి ముఖారవిందాన్ని మరింత పెంచుతుంది. ఆ చిరునవ్వే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తుంటుంది. అయితే, ఆ చిరునవ్వు.. మనం దంతాల రంగుపైనా ఆధార పడి ఉంటుంది. దంతాలు తెల్లగా ఉంటే.. ఆ నవ్వుకు మరింత ఆందం తోడవుతుంది. అదే పసుపు రంగు మచ్చలు ఉన్నట్లయితే.. మనస్ఫూర్తిగా నవ్వడం కూడా కష్టంగానే ఫీలవుతుంటారు. అందుకే చాలా మంది తమ దంతాలను తెల్లగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, చాలా మంది తమ దంతాలపై పసుపు రంగు మరకల ఉండటంతో.. గిల్టీగా ఫీలవుతుంటారు. అయితే, దంతాలను ముత్యాల్లా చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మీకు తెలుసా? మీ దంతాలు తెల్లగా మెరవాలంటే.. నిపుణులు కొన్ని సూచనలు చేశారు. వాటిని పాటించడం ద్వారా దంతాలు ముత్యాల్లా మెరుస్తాయని చెబుతున్నారు. మరి మీ ప్రకాశవంతమైన చిరునవ్వును పునరుద్ధరించడానికి, దంతాలను తెల్లగా మార్చే ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మనం తినే ఆహారం దంతాలపై ప్రభావం చూపుతుంది.. కాఫీ, టీ, వైన్ వంటి టానిన్‌లు కలిగిన ఆహారాలు, పానీయాలు మీ దంతాలకు పసుపు రంగు వచ్చేలా చేస్తాయి. ఆమ్లత్వంతో కూడిన ఆహార పదార్థాలు కూడా దంతాలను పసుపు రంగులోకి మారుస్తాయి. చక్కెర పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. పాలు, పాల ఉత్పత్తులు, జున్ను, పెరుగు వంటి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార దార్థాలను ఎక్కువగా తీసుకోండి. అలాగే.. వాట్ నట్స్, బాదం, పుట్టగొడుగులు, గుడ్లు, చిలగడదుంపలు, క్యారెట్లు తినండి.

దంతాలను తెల్లగా ఉండాలంటే దీనికి దూరంగా ఉండాలి.. దంతాల రంగు మారడంలో ధూమపానం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ధూమపానాన్ని వదిలేయండి. ఎంత ఎక్కువ ధూమపానం చేస్తే.. మీ దంతాలు అంతగా ముదురు పసుపు రంగులోకి మారిపోతాయి.

బేకింగ్ సోడా.. బేకింగ్ సోడాలో దంతాలను తెల్లగా మార్చే గుణాలు ఉన్నాయని అంటారు. ఈ బేకింగ్ సోడాతో పళ్లు తోమడం చేయాలి. అలా కొద్ది రోజులు చేశాక.. మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దంతాలపై ఉన్న పసుపు రంగు క్రమంగా తొలగిపోతుంది. అలా పళ్లు తెల్లగా మారుతాయి.

ఆయిల్‌తో పళ్లు శుభ్రం చేయడం.. కొబ్బరి నూనె పుక్కిలింత అనేది సాంప్రదాయక పద్ధతి. కొబ్బరి నూనెలో సూక్ష్మ జీవుల నిరోధక లక్షణాలు ఉన్నాయి. చిగుళ్లు, దంతాలను రెండింటినీ బలంగా చేస్తుంది. మీ నోటిలో ఒక చెంచా కొబ్బరి నూనె తీసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు గార్గ్ చేయాలి. లేదా టూత్ బ్రష్‌లో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి బ్రష్ చేయండి. పొద్దుతిరుగుడు, నువ్వుల నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేసిన కొద్ది రోజుల తరువాత ఫలితాలను మీరే గమనించవచ్చు.

దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. తెల్లటి దంతాలు కావాలంటే.. రోజూ సరిగా బ్రష్ చేసుకోవాలి. టూత్‌పేస్ట్, ఫ్లోసింగ్, మౌత్ వాష్‌తో నోటిని శుభ్రం చేసుకోవాలి. రోజుకు కనీసం రెండుసార్లు బ్రష్ చేయడం ఇంకా మంచిది. ప్రతీ రోజూ ఉదయం, రాత్రి పడుకకునే ముందు బ్రష్ చేయండి. ఎలక్ట్రిక్, సోనిక్ టూత్ బ్రష్‌లు రెండూ సాంప్రదాయ టూత్ బ్రష్‌ల కంటే ఎక్కువగా దంతాలపై ఉన్న పసుపు రంగు మరకలను తొలగించడంలో ఉపకరిస్తాయి.

నిపుణుల సలహాలు తీసుకోండి.. పై రెమిడీలు ఏవీ మీకు పని చేయకపోతే దంతవైద్యుడిని సంప్రదించండి. ప్రొఫెషనల్ క్లీనింగ్, వైటెనింగ్ చేయడానికి ఇదే చివరి దారి.

Also read:

Gold Price Today: బంగారం ధర జిగేల్‌.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తాజా రేట్లు ఇలా ఉన్నాయి..!

Weight Loss: బరువు తగ్గాలా?.. నచ్చిన ఆహారం తింటూనే బరువు తగ్గొచ్చు.. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి..

Kabul: ప్రయాణికులతో కిక్కిరిసిన కాబుల్ విమానాశ్రయం.. రన్‌ వే పైనే ఎదురుచూపులు.. ఎందుకంటే?

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?