Kabul: ప్రయాణికులతో కిక్కిరిసిన కాబుల్ విమానాశ్రయం.. రన్‌ వే పైనే ఎదురుచూపులు.. ఎందుకంటే?

అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం కాబూల్‌లో వందలాది మంది ఇతర దేశీయులు ఉన్నారు.

Kabul: ప్రయాణికులతో కిక్కిరిసిన కాబుల్ విమానాశ్రయం.. రన్‌ వే పైనే ఎదురుచూపులు.. ఎందుకంటే?
Kabul Airport
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 16, 2021 | 12:54 PM

Kabul: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం కాబూల్‌లో వందలాది మంది ఇతర దేశీయులు ఉన్నారు. వారందరినీ సురక్షితంగా స్వదేశాలకు తీసుకొచ్చేందుకు పలు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అలాగే భారత్‌ కూడా తగిన ఏర్పాట్లు చేసింది. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేసే సిబ్బందితోపాటు భారతీయులకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా పలు చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కాబుల్ నుంచి అత్యవసరంగా వెనక్కి తీసుక రావడానికి తగిన ఏర్పాట్లు కూడా చూసినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై పలు దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కాబుల్ విమానాశ్రయం ఒక్కటే దిక్కు.. కాబూల్‌ సరిహద్దులన్నీ దాదాపు మూసుకుపోయాయి. కాబూల్‌ నగరానికి సమీపంలోని జలాలాబాద్‌ను సైతం తాలిబన్లు ఆక్రమించారు. దీంతో నగరం మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లింది. దీంతో కాబూల్‌ నుంచి బయటకు వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కేవలం విమాన మార్గమే దిక్కు. స్వదేశానికి వెళ్లేవారితో కాబూల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కిక్కిరిసిపోయింది. పలు దేశాలకు చెందిన వారు అక్కడినుంచి పెట్టె బేడా సర్దుకుని కాబుల్ విమానాశ్రయంలో ఎదురుచూస్తున్నారు. అఫ్గానిస్తాన్‌కు బాహ్య ప్రపంచంతో అనుసంధానించేందుకు కాబూల్‌ ఎయిర్‌పోర్టులో ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ‘నాటో’ పేర్కొంది.

Kabul Airport

కాగా, భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన సి–17 గ్లోబ్‌మాస్టర్‌ మిలిటరీ ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌ను సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే కాబూల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి 129 మంది భారతీయులతో కూడిన ఎయిర్‌ ఇండియా విమానం ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది.

Also Read: ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని రాజీనామా చేస్తారా ? మాజీ ఆఫ్ఘన్ హోం మంత్రికి అధికారం అప్పగింత ..?

Afghanistan: తాలిబన్లకు లొంగిపోయిన ఆఫ్గన్‌ ప్రభుత్వం.. శాంతియుతంగా అధికారం అప్పగిస్తామని ప్రకటన

ఆఫ్గనిస్తాన్ లో అమెరికన్ ఎంబసీ అధికారులు ఏం చేస్తున్నారో తెలుసా ..?