కాబూల్ నుంచి పారిపోయిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని.. రక్తపాతాన్ని నివారించేందుకేనని ప్రకటన

ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని కాబూల్ నుంచి పారిపోయారు. దేశంలో మరింత రక్తపాతం జరగకుండా నివారించేందుకే తాను పారిపోయానని ఆయన ప్రకటించాడు.

కాబూల్ నుంచి పారిపోయిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని.. రక్తపాతాన్ని నివారించేందుకేనని ప్రకటన
Afghanistan President Ashraf Ghani
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 16, 2021 | 12:49 PM

ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని కాబూల్ నుంచి పారిపోయారు. దేశంలో మరింత రక్తపాతం జరగకుండా నివారించేందుకే తాను పారిపోయానని ఆయన ప్రకటించాడు. తను కాబూల్ లోనే ఉన్న పక్షంలో ఎంతోమంది దేశభక్తులు అమరులయ్యేవారని, ఈ నగరం నాశనమై పోయేదని ఆయన అన్నాడు. తాలిబన్లే గెలిచారని, ఇక ఈ దేశ ప్రజల గౌరవం, వారి ఆస్తుల బాధ్యత వారిదేనని పేర్కొన్నాడు. నేను తజికిస్థాన్ వెళ్ళిపోయాను అని ఆయన తెలిపాడు. అయితే ప్రజలను ఈ స్థితిలో వదిలి ఘని వెళ్లిపోయాడంటూ శాంతి ప్రక్రియ చర్చలకు నేతృత్వం వహించిన అబ్దుల్లా అబ్దుల్లా వ్యాఖ్యానించాడు. ఆయన ఇలా చేసి ఉండవలసింది కాదని అభిప్రాయపడ్డాడు. కాగా-నిన్న అధ్యక్ష భవనం తాలిబాన్లకు పూర్తిగా వశమైంది. వందలాది ఆఫ్ఘన్లు కాబూల్ విమానాశ్రయం వద్ద తమ కుటుంబాలతో సహా అక్కడికి చేరుకున్నారు. మహిళలు, పిల్లలు విమానాశ్రయ ఆవరణలో కనిపించారు. మరోవైపు తాలిబన్లు.. కాబూల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నందుకు హర్షం ప్రకటిస్తున్నారు. ఆఫ్ఘన్ ప్రజలకు, ముజాహిదీన్లకు నేడు ఎంతో గొప్ప దినమని, 20 ఏళ్ళ త్యాగాలకు, తమ ప్రయత్నాలకు వారు తగిన ఫలాలు అందుకున్నారని తాలిబన్ల పొలిటికల్ కార్యాలయ అధికార ప్రతినిధి మహమ్మద్ నయీం అన్నారు. దేశంలో వార్ పూర్తి అయిందని, తాము శాంతియుత అంతర్జాతీయ సంబంధాలను కోరుతున్నామని ఆయన పేర్కొన్నాడు.

కొత్త ప్రభుత్వం ఎలా ఉంటుందో, దీని రూపు రేఖలేమిటో త్వరలో ప్రకటిస్తాం అని నయీమ్ అన్నాడు. ప్రజలెవరికీ హాని చేయబోమని ఆయన హామీ ఇచ్చాడు. అటు అమెరికన్ సైనికులు.. ఆఫ్ఘన్ లోని తమ దేశస్థులను స్వదేశానికి తరలిస్తున్నారు. ఆఫ్ఘానిస్తాన్ లో నాయకత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధ్యక్షుడు జోబైడెన్ ప్రత్యర్థులు వ్యాఖ్యానించారు. కాబూల్ లోని అమెరికన్ రాయబార కార్యాలయంపై తమ దేశ జాతీయ పతాకాన్ని దించివేసినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. కాబూల్ లో నిన్న అక్కడక్కడా గన్ ఫైరింగ్ శబ్దాలు వినిపించినా మొత్తం మీద ప్రశాంతంగానే ఉన్నట్టు కనిపించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: IND vs ENG: బాల్ టాంపరింగ్..! బూట్లతో బంతి ఆకారం మార్చేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రయత్నం.. హెచ్చరించని అంపైర్లు

Neeraj Chopra: ఒలింపిక్ గోల్డెన్ బాయ్ మరో రికార్డు..! ఆటలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ సూపర్ ఫాస్టే అంటూ నెటిజన్ల కామెంట్లు

డయాబెటిస్‌తో పాటు ఆ సమస్యలున్నాయా..? ఈ దివ్యఔషధం మీకోసమే..
డయాబెటిస్‌తో పాటు ఆ సమస్యలున్నాయా..? ఈ దివ్యఔషధం మీకోసమే..
కొబ్బరికాయలో పువ్వు వస్తే వదలకుండా తినేయండి..ఆరోగ్య ప్రయోజనాలు
కొబ్బరికాయలో పువ్వు వస్తే వదలకుండా తినేయండి..ఆరోగ్య ప్రయోజనాలు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో రాజకీయ వేడి..
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో రాజకీయ వేడి..
సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..
సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..