AP schools Re-opening: ఏపీలో నేటినుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. తల్లిదండ్రుల అనుమతితోనే..
Schools Re-opening in AP: ఆంధ్రప్రదేశ్‌లో నేటినుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైఎస్ జగన్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని
Schools Re-opening in AP: ఆంధ్రప్రదేశ్‌లో నేటినుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైఎస్ జగన్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది వైరస్ బారిన పడకుండా ఉండేలా విద్యా శాఖ అన్ని జాగ్రత్తలు చేపట్టింది. దీనిలో భాగంగా నాడు-నేడు పథకం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా తొలిదశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. రెండో విడత నాడు-నేడు పనులను సీఎం తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ విద్యా సంవత్సరానికి 42.34 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు.
పాఠశాలల వారీగా కోవిడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) అమలుకు వీలుగా మార్గదర్శకాలు విడుదల చేసి.. అధికారులకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా పిల్లలను అనుమతించనున్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితో తరగతులకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలి.పాఠశాలల పున:ప్రారంభం నేపథ్యంలో పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయించారు. దీంతోపాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో శానిటైజేషన్ చేయాల్సి ఉంటుంది. పాఠశాలలు గతంలో నిర్దేశించిన సమయాల ప్రకారమే పని చేస్తాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిరోజూ స్కూళ్లకు హాజరుకావాలని విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పిల్లల సంఖ్యకు తగిన వసతులు లేకపోతే.. విద్యార్థులను రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించారు.
విద్యార్థులు పాఠశాలలోకి ప్రవేశించే ముందు వారికి థర్మల్ స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలుంటే వారిని ఇళ్లకు తిరిగి పంపి వైద్య పరీక్షలు చేయిస్తారు. కోవిడ్ లక్షణాలున్న వారికోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించాలి. ఇళ్లలో వృద్ధులు, రోగులు ఉన్న విద్యార్థులు స్కూలుకు రావొద్దంటూ విద్యాశాఖ సూచించింది. అనారోగ్యంతో ఉండే విద్యార్థులు కూడా స్కూళ్లకు రాకుండా హెచ్‌ఎంలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఇద్దరు విద్యార్థులు, సిబ్బందిలో ఒకరికి ప్రతి వారం ర్యాండమ్‌గా వైద్య పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వారిలో ఎవరికైనా పాజిటివ్ ఉంటే కనుక మొత్తం తరగతిలోని విద్యార్థులందరికీ పరీక్షలు జరిపేలా విద్యాశాఖ అన్ని స్కూళ్లకు ఆదేశాలు పంపింది. దీంతోపాటు పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించనున్నారు.
Also Read: