Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Heavy Rains: తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం!

తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెంగాణలోని పలు జల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Telangana Heavy Rains: తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు..  బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం!
Weather Update
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 16, 2021 | 7:21 AM

Telangana Heavy Rains: తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెంగాణలోని పలు జల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతం ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక, రాష్ట్రంలో రాత్రి నుంచి పలచోట్ల వర్షం కురిస్తోంది. ఇటు హైదరాబాద్ లోని అన్నిప్రాంతాలల్లో వర్షంపడింది. దీంతో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కూ అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెంట్లం(భద్రాద్రి జిల్లా)లో 6.5, పెదవీడు(సూర్యాపేట)లో 3.3, పమ్మి(ఖమ్మం జిల్లా)లో 3.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 20 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదముందని రైతులుఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణం చల్లబడి వర్షాలు కురవడంతో పంటలకు కొంత మేలు జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు. మరో వైపు అధికారులు అప్రమత్తం అయ్యారు.

Read Also… Couple Suicide: కరోనా ఎఫెక్ట్‌తో అప్పుల బాధను తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఓ ప్రైవేట్‌స్కూల్ యాజమాన్య దంపతులు