Neeraj Chopra: ఒలింపిక్ గోల్డెన్ బాయ్ మరో రికార్డు..! ఆటలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ సూపర్ ఫాస్టే అంటూ నెటిజన్ల కామెంట్లు

ఒలింపిక్‌లో బంగారు పతకాన్ని సాధించి సెలబ్రెటీగా మారిన భారత యువ క్రీడాకారుడు షేర్ చేసిన ఓ ఫొటో.. సోషల్ మీడియాలో పలు రికార్డులను నెలకొల్పింది. అటు ఆటలోనే కాదు..

Neeraj Chopra: ఒలింపిక్ గోల్డెన్ బాయ్ మరో రికార్డు..! ఆటలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ సూపర్ ఫాస్టే అంటూ నెటిజన్ల కామెంట్లు
Neeraj Chopra
Follow us
Venkata Chari

|

Updated on: Aug 16, 2021 | 7:29 AM

Neeraj Chopra: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియా రూపు రేఖలు మారిపోయాయి. డిజిటల్ మీడియా హవా కొనసాగుతోన్న నేటి రోజుల్లో.. సెలబ్రెటీలు ఏది పోస్టు చేసినా సంచలంగా మారిపోతోంది. కామెంట్లు, లైకులతో రికార్డులు మీద రికార్డులు సెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ సెలబ్రెటీలకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంటారు. అయితే తాజాగా ఒలింపిక్‌లో బంగారు పతకాన్ని సాధించి సెలబ్రెటీగా మారిన భారత యువ క్రీడాకారుడు షేర్ చేసిన ఓ ఫొటో.. సోషల్ మీడియాలో పలు రికార్డులను నెలకొల్పింది. అటు ఆటలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తనకు ఎదురేలేదంటూ నిరూపించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్‌తో దిగిని ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

కాగా, ఈ ఫొటో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకెళ్తోంది. ఈ రోజు ఈ ఫొటో 4 మిలియన్ల (40 లక్షలు)కు పైగా లైకులతో దూసుకపోతోంది. ఈ ఫొటో షేర్ చేసిన నేటికి 7 రోజులే కావడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువ భారత క్రీడాకారుడు షేర్ చేసిన ఓ ఫొటోకు ఈ రేంజ్‌లో లైకులు రావడం ఇదే తొలిసారంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తు్న్నారు. ఈ రికార్డును యువ క్రీడాకారుడు, ఒలింపిక్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా సొంతం చేసుకున్నాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత నీరజ్ చోప్రా తాజా పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 2 కి చేరుకున్నాడు. ఈ ర్యాంక్ 23 ఏళ్ల నీరజ్ చోప్రా కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్ కావడం విశేషం. వేసవి క్రీడలకు ముందు భారత అథ్లెట్ ప్రపంచ ర్యాకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్నాడు. టోక్యో 2020లో భారతదేశం తరపున ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తొలిసారి ఒలింపిక్ పతకాన్ని అందించాడు. దీంతో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించి పలు రికార్డులను నెలకొల్పాడు. షూటర్ అభినవ్ బింద్రా తర్వాత దేశానికి వ్యక్తిగత ఒలింపిక్‌ స్వర్ణ పతకాన్ని అందించి విజేతగా నిలిచాడు. నీరజ్ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరంలో విసిరి బంగారు పతకం సాధించాడు. ఈ ఫైనల్‌లో నీరజ్ రెండవ అత్యుత్తమ త్రో (87.03 మీ) విసిరి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు.

Also Read:

IND vs ENG 2nd Test: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. అందివచ్చిన అవకాశాన్ని టీమిండియా వినియోగించుకుంటుందా?

Vinesh Fogat: క్షమాపణ చెప్పిన వినేశ్ ఫొగాట్.. తదుపరి చర్యలకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం