Anurag Thakur: ‘2024 ఒలింపిక్ పతక విజేతలతో పోడియం నిండి పోవాలి.. మరింత విస్తృతంగా టాప్స్’: అనురాగ్ ఠాకూర్
ప్రభుత్వం చేపట్టిన ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)’ను మరింతా విస్తృతపరిచేందుకు ప్లాన్ చేసినట్లు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
Anurag Thakur: ప్రభుత్వం చేపట్టిన ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)’ను మరింతా విస్తృతపరిచేందుకు ప్లాన్ చేసినట్లు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఆదివారం రాత్రి టోక్యోలో పతకాలు గెలిచిన అథ్లెట్లను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘2024, 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని టాప్స్‌లో ఎక్కువ మంది అథ్లెట్లకు చోటు కల్పిస్తామని ఆయన తెలిపారు. 2024 ఒలింపిక్స్ తర్వాత నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పతక విజేతలు ఉండాలని, వేదికపై పట్టనంత మంది పతకాలు గెలవాలని’’ ఆయన పేర్కొన్నారు. బంగారు పతకం గెలిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు రూ.75 లక్షలు అందించార. అలాగే రజత పతాకాలు గెలిచిన మీరాబాయి, రవి దహియాలకు చెరో రూ.50 లక్షలు, కాంస్య పతకాలు సాధించిన పీవీ సింధు, లవ్లీనా, బజ్‌రంగ్ పునియాకు తలో రూ.25 లక్షలను ఐఓఏ అందించింది. అలాగే కాంస్య పతకం గెలిచిన పురుషుల హాకీ జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.10 లక్షల చొప్పున అందించారు.
కాగా, ఒలింపిక్ విజేతకు ఐఓఏ నగదు ప్రోత్సాహకాలను అందించడం ఇదే మొదటిసారి. గోల్డ్ విజేత సాధించిన చోప్రా కోచ్‌కు రూ. 12.5లక్షలు, దహియా, చానుల కోచ్‌లకు రూ. 10లక్షలు అందించారు. అలాగే కాంస్యం సాధించిన విజేతల కోచ్‌లకు రూ. 7.5 లక్షలు అందించారు. అలాగే మొత్తం 128 టోక్యో ఒలింపియన్లకు రూ.1లక్ష అందిస్తామని ప్రకటించారు. ఈ వేడకకు పతవ విజేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా పతకాలు గెలుచుకున్న జాతీయ క్రీడా సమాఖ్యలకు (ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు) రూ. 30 లక్షల చొప్పున అందించారు. ‘ఒలింపిక్స్‌కు ముందు కరోనాతో దేశంలో చీకటి ఆవరించిందని, కానీ, టోక్యో ఒలింపిక్స్‌లో మీ (అథ్లెట్ల) ప్రదర్శనతో అన్నింటినీ మార్చేశారు. మీరు దేశంలో 1.3 బిలియన్ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు తెచ్చారు’ అని బాత్రా పేర్కొన్నారు.
Union Minister @ianuragthakur felicitated Indian Olympic Medalists at a program organised by the Indian Olympic Association.
| @WeAreTeamIndia | pic.twitter.com/oUKA6VUVwb
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) August 15, 2021