PM Narendra Modi: డబ్ల్యూఏవైసీలో 15 పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చరీ బృందం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో 15 పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు.
PM Narendra Modi: ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో 15 పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఈమేరకు ప్రధాని ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. ప్రజలను గర్వపడేలా చేశారంటూ అభింనందించారు. కాగా, 2021 ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లు పోలాండ్‌లోని వ్రోక్లాలో జరిగాయి. అలాగే ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్ రికర్వ్ విభాగంలోనూ భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో చివరి రోజు భారత ఆర్చర్లు 5 బంగారు పతకాలు, 3 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 8 పతకాలు సాధించారు. అండర్–21 జూనియర్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో కోమలిక బారి 7–3తో 2018 యూత్ ఒలింపిక్స్ చాంపియన్ ఇలియా కెనాలెస్ (స్పెయిన్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది.
ప్రధాని మోడీ ట్వీట్‌లో.. “పోలాండ్‌లోని వ్రోక్లాలో జరిగిన ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో భారత బృందం 8 స్వర్ణాలతో సహా 15 పతకాలు సాధించడం మాకు గర్వంగా ఉంది. భారత బృందానికి అభినందనలు. వారి భవిష్యత్తులో మరింతగా రాణించాలి. ఈ విజయం మరింత మంది యువకులకు విలువిద్యలో రాణించేందుకు స్ఫూర్తినిస్తుందని” పెర్కొన్నారు.
The Indian contingent at the World Archery Youth Championships in Wroclaw has made us proud by winning 15 medals including 8 Golds. Congrats to our team and best wishes for their future endeavours. May this success inspire more youngsters to pursue archery and excel in it. pic.twitter.com/b5E5UdE4zX
— Narendra Modi (@narendramodi) August 15, 2021
Also Read: