Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: పంత్, ఇషాంత్‌లపై కోప్పడ్డ విరాట్ కోహ్లీ, రోహిత్‌.. ఎందుకో తెలుసా?

IND vs ENG: భారత్ -ఇంగ్లండ్ టీంల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ లార్డ్స్‌లో జరుగుతోంది. ఆదివారం జరిగిన నాల్గవ రోజు ఆట చివరి క్షణాల్లో మైదానంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.

IND vs ENG: పంత్, ఇషాంత్‌లపై కోప్పడ్డ విరాట్ కోహ్లీ, రోహిత్‌.. ఎందుకో తెలుసా?
Rohit Sharma And Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Aug 16, 2021 | 1:46 PM

IND vs ENG: భారత్ -ఇంగ్లండ్ టీంల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ లార్డ్స్‌లో జరుగుతోంది. ఆదివారం జరిగిన నాల్గవ రోజు ఆట చివరి క్షణాల్లో మైదానంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ లార్డ్స్ బాల్కనీ నుంచి క్రీజులో ఆడుతోన్న రిషబ్ పంత్, ఇషాంత్ శర్మలపై కోపం చూపించారు. విరాట్, రోహిత్ ఆటగాళ్లపై కోపానికి కారణం ఏంటంటే.. చివరి సెషన్‌లో బ్యాడ్ లైట్ కారణంగా బంతి కనిపించకపోయినా పంత్‌తోపాటు ఇషాంత్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇది గమనించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ ఇద్దరూ ఒకేసారి వారికి సైగ చేస్తూ.. నిలబడి మరీ అరిచారు. అయితే మైదానంలో ఉన్న రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ బ్యాడ్‌లైట్‌పై అంపైర్‌కు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అయితే లార్డ్స్ బాల్కనీ నుంచి కెప్టెన్ కోహ్లీ, రోహిత్ మాత్రం వారి వైపు చాలా కోపంగా చూస్తు అరిచారు. ఇది వీడియోలో చాలా స్పష్టంగా కనిపించింది. ఈమేరకు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోలో అనుకోకుండానే ఇద్దరూ ఒకేసారి వారిపై కోపం చూపిచడంతో నెటిజన్లు పలు కామెంట్లతో వీడియోను వైరల్ చేస్తున్నారు.

కోహ్లీ స్పందన తర్వాత ముగిసిన ఆట.. కోహ్లీకి భారత్ మరిన్ని వికెట్లు కోల్పోవడం ఇష్టం లేదు. మరోవైపు, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కొత్త బంతి కోసం అంపైర్‌ను సంప్రదిస్తున్నాడు. అయితే బ్యాడ్ లైట్‌తో బంతి కనిపించకుండా ఆడుతుండడంతో చివరి క్షణంలో మరిన్ని వికెట్లు కోల్పోయే అవకాశం ఉండడంతో విరాట్, రోహిత్ ఇద్దరూ పంత్, ఇషాంత్‌పై కోపం ప్రదర్శించారు. బ్యాడ్ లైటింగ్‌పై అంపైర్‌కు ఫిర్యాదు చేయమని కోరారు. వీరు సైగ చేసిన తరువాత కేవలం ఒకే బంతి బౌల్ చేశారు. అనంతరం అంపైర్లు బ్యాడ్ లైట్ కండీషన్‌ను తనిఖీ చేసి, నాల్గవ రోజు ఆట నిలిపేశారు.

భారమంతా రిషభ్ పంత్ పైనే.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి, భారత స్కోరు 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. టీమిండియా ప్రస్తుతం 154 ఆధిక్యంలో ఉంది. రిషభ్ పంత్ 14, ఇషాంత్ శర్మ 4 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ టాప్ ఆర్డర్ తీవ్రంగా నిరాశపరిచింది. రోహిత్ శర్మ 21, కేఎల్ రాహుల్ 5, కెప్టెన్ కోహ్లీ కేవలం 20 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. చెతేశ్వర్ పుజారా, వైస్ కెప్టెన్ అజింక్య రహానే భారత జట్టు ఇన్నింగ్స్‌ను ఆదుకుని, భారత్‌ను తక్కువ పరుగులకే ఆలౌట్ కాకుండా క్రీజుల పాతుకపోయి మరీ బ్యాటింగ్ చేవారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. పుజారా 45 పరుగులు చేయగా, రహానే 61 పరుగులు చేసిన తర్వాత ఔట్ అయ్యారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (3) రెండో ఇన్నింగ్స్‌లో నిరాశ పరిచాడు.

Also Read:

PM Narendra Modi: డబ్ల్యూఏవైసీలో 15 పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చరీ బృందం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Anurag Thakur: ‘2024 ఒలింపిక్ పతక విజేతలతో పోడియం నిండి పోవాలి.. మరింత విస్తృతంగా టాప్స్’: అనురాగ్ ఠాకూర్