8మంది టీమిండియా ఆటగాళ్ల అరంగేట్రం.. అంచనాలు శూన్యం.. కానీ, ఇంగ్లండ్‌పై 6 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం

Indian Women Cricket Team: ఈ విజయం భారత క్రికెట్ జట్టుకు ఎంతో చారిత్రాత్మకమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఎనిమిది మంది ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. దీంతో టీమిండియాను పోటీదారుగా పరిగణించలేదు.

8మంది టీమిండియా ఆటగాళ్ల అరంగేట్రం.. అంచనాలు శూన్యం.. కానీ, ఇంగ్లండ్‌పై 6 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం
Mithali Raj
Follow us
Venkata Chari

|

Updated on: Aug 16, 2021 | 12:37 PM

IND vs ENG: చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ వెళ్లినప్పుడు పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే.. ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో ఎంతో బలంగా ఉంటుంది. మరొకటి కారణం 8 మంది ఆటగాళ్లు టీమిండియా తరపున తొలిసారిగా టెస్ట్ క్రికెట్‌ని ప్రారంభించనుండడం. అయితే, ఈ మ్యాచ్ ఫలితం మాత్రం అందిర అంచనాలను తలకిందులు చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అయితే ఈ మ్యాచులో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్లేయర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం గమనార్హం. ఈ మ్యాచ్ ఆగస్టు 13 నుంచి 16 వరకు భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) మహిళా జట్ల మధ్య 2014లో జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ సారా టేలర్ అత్యధికంగా 30 పరుగులు సాధించింది. భారత జట్టు తరపున నిరంజన నాగరాజన్ నాలుగు వికెట్లు తీసింది. భారత్ తరపున శుభలక్ష్మి శర్మ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ప్రత్యుత్తరంగా, భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 114 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో స్వల్ప ఆధిక్యం సాధించింది. నిరంజన 27 పరుగులు చేయగా, మంధన 22 పరుగులు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జెన్నీ గన్ 5 వికెట్లు, కేట్ క్రాస్ 3 వికెట్లు పడగొట్టారు.

హర్మన్‌ప్రీత్-మంధనాతో సహా ఎనిమిది మంది ఆటగాళ్లు అరంగేట్రం.. రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ జట్టు 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ టీంలో జెన్నీ గన్ అజేయంగా 62 పరుగులు సాధించింది. అలాగే సారా టేలర్ 40, లారెన్ విన్‌ఫీల్డ్ హిల్ 35 పరుగులు అందించారు. టీమిండియా తరఫున జూలన్ గోస్వామి అత్యధికంగా 4 వికెట్లు తీయగా, శుభలక్ష్మి శర్మ, ఏక్తా బిష్ట్, శిఖా పాండే తలో రెండు వికెట్లు సాధించారు. అయితే, భారత్ విజయానికి 181 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ అజేయంగా 50 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చింది. మంధనా 51 పరుగులు చేసింది. కామిని 28 పరుగులు చేయగా, శిఖా పాండే అజేయంగా 28 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఎనిమిది మంది ఆటగాళ్లలో తిరుష్ కామిని, నిరంజన నాగరాజన్, శుభలక్ష్మి శర్మ, ఏక్తా బిష్త్, శిఖా పాండే, పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్ కౌర్, ఎస్. మంధనా ఉన్నారు.

Also Read:

PM Modi – Sindhu: కల నెరవేరింది.. ప్రధాని మోడీతో కలిసి ఐస్ క్రీం తిన్న పీవీ సింధు

Viral Video: పంత్, ఇషాంత్‌లపై కోప్పడ్డ విరాట్ కోహ్లీ, రోహిత్‌.. ఎందుకో తెలుసా?